రకుల్ ప్రీత్‌కు మళ్లీ చేదు అనుభవం.. హాట్‌గా అందాలు ఆరబోసినా.. బోసిపోయిన బాక్సాఫీస్

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్నా బాలీవుడ్‌లో కనీస రేంజ్‌లో హిట్టు కొట్టలేక అందాల భామ రకుల్ ప్రీత్ కష్టాలు పడుతున్నది. తాజాగా విడుదలైన దే దే ప్యార్ దే చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లు సాధించింది. అజయ్ దేవగన్, టబు లాంటి అగ్ర తారలు ఉన్నప్పటికీ.. దే దే ప్యార్ దే సినిమా నిర్మాతకు కలెక్షన్లను ఇవ్వలేకపోయిందనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. దీంతో రకుల్‌కు మరోసారి బాలీవుడ్‌లో చేదు అనుభవం ఎదురు కాబోతున్నదా అనే మాట వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

 బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకొనేందుకు

బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకొనేందుకు

2014లో యారియాన్ చిత్రంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. ఆ తర్వాత ఐయారీ చిత్రంలో కనిపించింది. ఇక దే దే ప్యార్ దే సినిమా రిలీజ్‌కు ముందు మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. రకుల్ గ్లామర్‌ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చివరకు సెన్సార్‌ కత్తెరకు కూడా ఆమె అందాలు దొరికిపోయాయి. వడ్డి షరాబాన్ పాటలోని కొన్ని సీన్లపై సెన్సార్ అధికారులు భారీగానే కత్తెర వేటు వేశారు.

దే దే ప్యార్ దే చిత్రం వసూళ్లు

దే దే ప్యార్ దే చిత్రం వసూళ్లు

భారీ అంచనాల మధ్య మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దే దే ప్యార్ దే చిత్రం. ఈ సినిమాపై సినీ విమర్శకులు పాజిటివ్‌గానే స్పందించారు. భారీ ఎత్తున్న రేటింగ్‌లు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్‌కు రాలేకపోయారు. ఈ చిత్రం తొలి రోజున రూ.8 నుంచి రూ.8.5 కోట్లు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 వీకెండ్ కలెక్షన్లపైనే

వీకెండ్ కలెక్షన్లపైనే

అయితే దే దే ప్యార్ దే సినిమాపై ఇంకా ట్రేడ్ వర్గాలు సానుకూలంగానే ఉన్నారు. వర్కింగ్ డే కావడంతో సినిమాకు ప్రేక్షకులు రాలేదని, వారాంతపు సెలవుల్లో సినిమాకు కలెక్షన్లు పెరుగతాయనే మాటను వినిపిస్తున్నారు. శని, ఆదివారాల్లో వచ్చే వసూళ్లను బట్టి సినిమా హిట్టా ఫట్టా అనేది డిసైడ్ అవుతుంది.

దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్

దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్

దే దే ప్యార్ దే సినిమాకు క్రేజ్ ఉండటంతో గురువారం సాయంత్రమే ప్రీమియర్లను వేశారు. దేశవ్యాప్తంగా 3100 స్క్రీన్లలో విడుదల చేశారు. అయితే శుక్రవారం ఫస్ట్, సెకండ్ షోకు వసూళ్లు దారుణంగా పడిపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మౌత్ ఆఫ్ వర్డ్‌తో కలెక్షన్లు పెరుగుతాయా అనే సందేహంగా మారింది.

వైవాహిక బంధాల బ్యాక్ డ్రాప్‌తో

వైవాహిక బంధాల బ్యాక్ డ్రాప్‌తో

వైవాహిక బంధాలు, వివాహేతర రిలేషన్స్ నేపథ్యంగా దే దే ప్యార్ దే సినిమా తెరకెక్కింది. 25 ఏళ్ల యువతి (రకుల్ ప్రీత్) ప్రేమలో పడిన 50 ఏళ్ల వివాహితుడిగా అజయ్ దేవగన్ నటించాడు. వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయిన భార్యగా టబు నటించింది. హై సొసైటీ కామెడీ, అడల్డ్ కంటెంట్‌తో ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఆకట్టుకొలేకపోయిందనే వాదన వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X