Acharya Day 1 Collections.. అలాంటి టాక్‌తో ఊహించని కలెక్షన్లు.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య చిత్రం ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్నది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించిన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు

ఆచార్య మూవీ విషయానికి వస్తే.. క్రేజీ కాంబినేషన్ ఉండటంతో ఈ సినిమాకు భారీ పాపులారిటీ లభించింది. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టే ఆచార్య భారీ బిజినెస్‌ను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ గణంకాలను నమోదు చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రీరిలీజ్ బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా ప్రీరిలీజ్ బిజినెస్

ఆచార్య చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో ఈ సినిమా హక్కులు 38 కోట్లకు, సీడెడ్‌లో 18.50 కోట్లు, ఉత్తరాంధ్రలో 13 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 9.50 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7.20 కోట్లు, గుంటూరు జిల్లాలో 9 కోట్లు, కృష్ణా జిల్లాలో 8 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4.30 కోట్లు బిజినెస్ జరిగింది.

ఆచార్య చిత్రం మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 107 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్‌లో 12 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.7 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 131.2 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. దీంతో ఈ సినిమా ముందు భారీ బ్రేక్ ఈవెన్ లక్ష్యం టార్గెట్‌గా నిలబడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య కలెక్షన్లు

ఇక ఆచార్య సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 7.90 కోట్లు, సీడెడ్‌లో 4.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.6 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.90 కోట్లు, గుంటూరు జిల్లాలో 3.7 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.9 కోట్లు, నెల్లూరు జిల్లాలో 2.30 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల గ్రాస్, 29.5 కోట్ల షేర్ సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు

ఆచార్య సినిమా కర్ణాటకలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజున కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో 1.60 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. అలాగే అమెరికాలో కూడా మంచి ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజున 1.2 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 42 కోట్లకుపైగా గ్రాస్, 31 కోట్ల షేర్ సాధించింది.

ఆచార్య లాభాల్లోకి రావాలంటే..

ఆచార్య లాభాల్లోకి రావాలంటే..

ఆచార్య చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను పరిశీలిస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 132 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సుమారు 32 కోట్ల వరకు ఈ చిత్రం కలెక్షన్లను సాధించింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరో100 కోట్లు రాబడితే గానీ.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X