RRR collections బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన రాజమౌళి.. తన రికార్డును తానే చెరిపేసిన జక్కన్న
భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాయడం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి కొత్తేమీ కాదు. గతంలో బాహుబలి 1తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న జక్కన్న.. ఆ తర్వాత బాహుబలి 2 మూవీతో తానేంటో సినీ ప్రపంచానికి చాటి చెప్పారు. బాహుబలి రిలీజ్ అనంతరం సుమారు 5 ఏళ్ల తర్వాత మళ్లీ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన RRR చిత్రం భాషా, ప్రాంతం, దేశం, కులం, మతం అనే తేడా లేకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. RRR సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటించిన తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
Recommended Video


తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం ఏరియాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు రూ.70 కోట్లు, సీడెడ్ హక్కులు 37 కోట్లకు, ఉత్తరాంధ్ర సంబంధించిన థియేట్రికల్ హక్కులు 22 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆంధ్రాలో పలు జిల్లాలో హక్కులు 62 కోట్లుగా నమోదౌంది. దీంతో తెలుగు రాష్ట్రాల హక్కుల విలువ సుమారు 190 కోట్లకుపైగానే ఉంది.

RRR బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఇలా..
కర్ణాటక థియేట్రికల్ హక్కులు 41 కోట్లు, తమిళనాడు హక్కులు 35 కోట్లు, కేరళ హక్కులు 9 కోట్లు, హిందీ హక్కులు 92 కోట్లు, మిగితా రాష్ట్రాల హక్కులు 8 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 75 కోట్లకు అమ్ముడుపోయాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 453 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి.

నైజాం, ఆంధ్రాలో తొలి రోజు కలెక్షన్లు
RRR సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల అధికారిక కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 70 కోట్ల గ్రాస్ వసూళ్లు, సీడెడ్‌లో 37 కోట్లు, ఉత్తరాంధ్రలో 22 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 14 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కోట్లు, గుంటూరులో 15 కోట్లు, కృష్ణా జిల్లాలో 13 కోట్లు, నెల్లూరులో 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో కలిపి మొత్తంగా 191 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది.

ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో
తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో 41 కోట్లు, తమిళనాడు 35 కోట్లు, కేరళలో 9 కోట్లు, హిందీ వెర్షన్‌లో 92 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 8 కోట్లు సాధించింది. ఓవర్సీస్‌లో 75 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ కలెక్షన్లు
RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను కొల్లగొడుతున్నది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 166 కోట్ల షేర్, 223 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లుగా నిలిచాయి. ఈ కలెక్షన్లు బాహుబలి 2 వసూళ్లను బ్రేక్ చేయడం విశేషంగా మారింది.

RRR లాభాల్లోకి రావాలంటే?
RRR సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చూస్తే.. 451 కోట్లుగా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా డిస్టిబ్యూటర్లు లాభాలు పంచుకోవాలంటే కనీసం 453 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం 166 కోట్లు తొలి రోజు వసూలు చేయగా.. ఇంకా 287 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ వారాంతానికి ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











