Game Changer Day 6 Box Office: టఫ్ ఫైట్‌లో కుమ్మేస్తున్న గేమ్ ఛేంజర్ ..6 వ రోజు ఎన్ని కోట్లంటే?
Game Changer Day 6 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ పాన్ ఇండియా మూవీ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది.అయితే.. ఎవరు ఊహించని విధంగా రామ్ చరణ్ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినా.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. గత రెండు రోజులు కలెక్షన్స్ తగ్గుతున్నాయనేది? వాస్తవం. అయితే.. ఇప్పటివరకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే ?ఆరో రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్ వివరాలిలా..
రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీలో రామ్ చరణ్ హీరో గా డ్యూయల్ రోల్ నటించగా.. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రకని ప్రధాన పాత్రలో నటించారు. వివేక్ వేల్మురుగన్ స్క్రీన్ ప్లే అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రామ్ చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబోలో రావడంతో గేమ్ ఛేంజర్ భారీగా అంచనాలు ఏర్పడాయి. దీంతో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగింది.

ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. గేమ్ ఛేంజర్ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కథ, కథనం సరిగా లేదనీ మెగా ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. ఇలా పలు కారణాల వల్ల గేమ్ ఛేంజర్ నెగిటివ్ టాక్ వచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడింది. కానీ, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు రూ. 21.6 కోట్లు, మూడు రోజు రూ.17 కోట్టు, నాలుగవ రోజు రూ. 8.50 కోట్లు, ఐదవ రోజు రూ. 10.19 కోట్లు వసూలు చేసింది గేమ్ ఛేంజర్.
ఇక గేమ్ ఛేంజర్ ఆరవ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. Sacnilk అంచనా ప్రకారం గేమ్ ఛేంజర్ డే 6 నాడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.50 కోట్లు వసూలు చేసింది. వాస్తవానికి 5 కంటే 33 శాతం కలెక్షన్లు పడిపోయాయి. వెర్షన్ వైస్ గా చూస్తే.. తెలుగులో ₹ 4.51 కోట్లు, హిందీలో ₹ 1.37 కోట్లు, తమిళంలో ₹ 0.73 కోట్లు వసూలు చేసింది. దీంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్లు రూ.112.8 కోట్లకు చేరుకుంది. రామ్ ఛేంజర్ మూవీపై బాలయ్య డాకుమహారాజ్, వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లను గట్టిపోటీ ఎదురవుతోంది. అలాగే..ఫైరసీ ఎఫెక్ట్ కూడా గేమ్ ఛేంజర్ కలెక్ష్లన్లపై పడిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వసూళ్ల గురించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బహిరంగంగా విమర్శించారు. వరుస ట్వీట్స్ చేస్తూ.. చిత్ర నిర్మాతలు ప్రకటించిన కలెక్షన్లపై సందేహాలు లేవనెత్తాడు. ఆ కలెక్షన్స్ అతిశయోక్తి గా , తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని పేర్కొన్నాడు. గేమ్ ఛేంజర్ నిర్మాతలు బాక్సాఫీస్ కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించి.. దక్షిణ భారత సినిమా ప్రతిష్టను దిగజార్చారని వర్మ ఆరోపించారు. బాహుబలి, RRR, KGF 2 వంటి చిత్రాలు ప్రామాణికమైన విజయాలను సాధించాయని పేర్కొన్నారు. ఇలాంటి కామెంట్స్ సినిమాపై నెటిగివిటీ స్ప్రెడ్ కావడానికి కారణమని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











