Ram Charan Vs NTR : దుమ్ము రేపిన గేమ్ చేంజర్.. దేవరను మించిన రాంచరణ్ మూవీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్‌ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా అనేక అడ్డంకులను దాటుకుని సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదలైంది. ప్రస్తుతం కలెక్షన్స్, రికార్డుల ట్రెండ్ నడుస్తుండటంతో గేమ్ ఛేంజర్‌‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని ట్రేడ్ పండితులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి గత నెలలో విడుదలైన పుష్ప 2 ది రూల్‌తో గేమ్ ఛేంజర్‌ను పోల్చి చూస్తున్నారు. మెగా అభిమానులు, అల్లు అభిమానులు, విశ్లేషకులు కూడా సినిమా గురించి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ram charan s game changer breaks jr ntr s devara ticket booking records

సోలో హీరోగా చెర్రీ నటించిన ఓ సినిమా ఆరేళ్ల తర్వాత రావడం ఓ విశేషం. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. భారీ అంచనాల నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ఫిలింనగర్ టాక్.

నైజాంలో రూ. 43 కోట్లు, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకొన్నది. ఇక నైజాంతో కలిపి 145 కోట్ల రూపాయల బిజినెస్‌ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుంది గేమ్ ఛేంజర్. ఈ నేపథ్యంలో 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. తొలి రోజు గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్ల ఓపెనింగ్స్‌ను రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సంక్రాంతి సెలవులు, వీకెండ్‌ను దృష్ట్యా గేమ్ ఛేంజర్‌ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు ఆశాభావం చేస్తున్నారు.

ram charan s game changer breaks jr ntr s devara ticket booking records

ఇదిలాఉండగా.. టికెట్ బుకింగ్స్ పరంగా గేమ్ ఛేంజర్ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. రామ్ చరణ్ మూవీకి ప్రముఖ తెలుగు బుకింగ్ యాప్ బుక్ మై షోలో జనవరి ఇప్పటి వరకు 1.3 మిలియన్ల టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. జనవరి 9 వరకు బుక్‌ మై షోలో సేల్ అయిన టికెట్ల విషయంలో గేమ్ ఛేంజర్ టాప్‌లో నిలిచింది. ఈ సినిమాకు ఒక్క అడ్వాన్స్ బుకింగ్‌లోనే 6.40 లక్షల టికెట్లు బుక్ అయి లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది.

ram charan s game changer breaks jr ntr s devara ticket booking records

తర్వాత రేఖాచిత్రం 79 వేలు (డే 1), యే జవానీ హై దివానీ 43 వేలు (రీ రిలీజ్), ఫతే 29 వేలు (అడ్వాన్స్ బుకింగ్), పుష్ప 2 25 వేలు (డే 36), ముఫాసా 19 వేలు (డే 21), మార్కో 18 వేలు (డే 21), ఐడెంటిటీ 6 వేలు (డే 8) నిలిచాయి. ఇక హిందీ టికెట్ బుకింగ్స్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన దేవర పార్ట్ 1 రికార్డును గేమ్ ఛేంజర్ అధిగమించింది. దేవరకు హిందీలో తొలి రోజు 19,231 వేల టికెట్లు అమ్ముడవ్వగా.. గేమ్ ఛేంజర్‌ 60,131 టికెట్ విక్రయాలతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది. మరి లాంగ్ రన్‌లో గేమ్ ఛేంజర్ ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: ram charan game changer devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X