Game Changer Day 1 Box Office: నెగెటివ్ టాక్‌తో సత్తా చాటిన గేమ్ చేంజర్.. రామ్ చరణ్ రికార్డు ఏంటో తెలుసా?
ఎన్నో అంచనాల మధ్య , మరెన్నో అవాంతరాలను దాటుకుంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది గేమ్ ఛేంజర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ్ చరణ్ మూవీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలు చూస్తే :
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన గత సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని గేమ్ ఛేంజర్ తెరకెక్కించారు శంకర్. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు.

శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ఫిలింనగర్ టాక్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు సోలోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో రికార్డు స్థాయి బిజినెస్‌గా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నైజాంలో రూ. 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకొన్నది. ఇక నైజాంతో కలిపి 145 కోట్ల రూపాయల బిజినెస్‌ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుంది గేమ్ ఛేంజర్. ఈ నేపథ్యంలో 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు, ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా కావడంతో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో ఆయన దూసుకెళ్తున్నారు. ఇక గత నెలలో అల్లు అర్జున్ పుష్ప 2తో రికార్డుల దుమ్ముదులిపాడు. ఈ నేపథ్యంలో అంతా గేమ్ ఛేంజర్ ఓపెనింగ్స్, వసూళ్లపైనే మాట్లాడుకుంటున్నారు. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ భారీగా క్యాష్ చేసుకుందని టాక్.
King size entertainment unleashes in theatres 🔥#GameChanger takes a blockbuster opening at the BOX OFFICE 💥💥#BlockbusterGameChanger GROSSES 186 CRORES WORLDWIDE on Day 1 ❤🔥
— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025
Book your tickets now on @bookmyshow
🔗 https://t.co/ESks33KFP4
Global Star @AlwaysRamCharan… pic.twitter.com/NqiqvscgR8
రీసెంట్‌గా రిలీజైన పాన్ ఇండియా సినిమాల రేంజ్‌లో కాకపోయినా ఉన్నంతలో గేమ్ ఛేంజర్ బాగానే రచ్చ చేసింది. తొలి రోజు తెలుగులో రూ. 44 కోట్లు, తమిళ్‌లో రూ.2.26 కోట్లు , హిందీలో రూ.8 కోట్లు, కర్ణాటక + మలయాళంలో రూ. 36 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లు చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. సోలో హీరోగా వినయ విధేయ రామ ఓపెనింగ్స్ (రూ.34 కోట్లు) రికార్డును రామ్ చరణ్ బద్ధలుకొట్టాడు. అయితే సంక్రాంతి సెలవులు, వీకెండ్ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ వసూళ్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











