Game Changer Day 3 Collection: షాకిచ్చేలా గేమ్ ఛేంజర్ వసూళ్లు..మూడో రోజు ఎన్ని కోట్లంటే?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేసిన చిత్రమే గేమ్ ఛేంజర్ . సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ మధ్య దుమ్మురేపుతోంది. ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్ తన ఊపును అలాగే కంటిన్యూ చేసిందా? మూడో రోజు ఎలాంటి వసూళ్లు రాబట్టిందో చూస్తే :

గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ఫిలింనగర్ టాక్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ram charan kiara advani s Game Changer Box Office Day 3 collection report

ఈ నేపథ్యంలో నైజాంలో రూ. 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే 145 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసింది గేమ్ ఛేంజర్. తద్వారా 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్లు, రాబట్టగా రెండో రోజు భారీ డ్రాప్స్ అందుకుని రూ. 28 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇక మూడో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ విడుదలైన రెండ్రోజుల గ్యాప్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ రిలీజైంది. కొన్ని ఏరియాల్లో చరణ్ మూవీపై బాలయ్య సినిమా ఇంపాక్ట్ చూపుతోందని అంటున్నారు విశ్లేషకులు. మిక్స్‌డ్ టాక్, నెగిటివిటీ వస్తున్నా రామ్ చరణ్ తన దమ్ము చూపిస్తున్నాడు. తెలుగులో వసూళ్లు డ్రాప్ అవుతుండగా.. హిందీలో మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం చిత్ర యూనిట్‌కు ఊరట కలిగిస్తోంది.

ram charan kiara advani s Game Changer Box Office Day 3 collection report

గేమ్ ఛేంజర్ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.10 కోట్లు, తమిళ్‌లో రూ.1.3 కోట్లు, హిందీలో రూ. 8 కోట్లు , కర్ణాటక , కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.30 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లు చొప్పున మొత్తంగా రూ.19 కోట్ల వసూళ్లు సాధించి వీకెండ్‌ను ముగించాడు రామ్ చరణ్. డాకు మహారాజ్ నుంచి పోటీ ఎదురవుతుండగా.. మంగళవారం విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కానుంది. వీటికి తోడు హిందీలో పుష్ప 2 హవా ఇంకా తగ్గలేదు.. 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను యాడ్ చేయడంతో అల్లు అర్జున్ మరింత బలం పుంజుకున్నాడు. మరి ఈ టఫ్ ఫైట్‌లో గేమ్ ఛేంజర్ ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: ram charan kiara advani s shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X