Game Changer Day 4 Box Office: మిక్స్ డ్ టాక్ తో రామ్ చరణ్ ఊచకోత.. గేమ్ చేంజర్ 4 వ రోజు ఎన్ని కోట్లంటే?
Game Changer Day 4 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ ( Game Changer). ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాపంగా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. కానీ, రోజురోజుకు గేమ్ చేంజర్ వసూళ్లు తగ్డాయి. అయితే.. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ ( Game Changer) మూవీ ఎన్ని కోట్లు వసూల్లు చేసింది? నాలుగోవ రోజు (Game Changer Day 4 collections) కలెక్షన్ వివరాల్లోకెళ్తే..
మెగా హీరో రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీలో రామ్ చరణ్ కథనాయకుడుగా నటించగా.. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్ , జయరామ్, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్ వేల్మురుగన్ స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ భారీ బడ్డెట్ మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగింది.

ఇలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ' గేమ్ ఛేంజర్ 'సినిమా ప్రీమియర్స్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. కథ, కథనం సరిగా లేదనీ , సినిమాను సగటు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనీ, ప్రేక్షకుల పాల్స్ అందుకోవడంతో డైరెక్టర్ శంకర్ ఫెయిల్ అయ్యారనీ, మూవీ టేకింగ్ పై మెగా ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. సెకండాఫ్ బోరింగ్ గా ఉందనీ, అలాగే..'నానా హైరానా' సాంగ్ ను తొలి రోజు యాడ్ చేయకపోవడం కూడా నెగిటివ్ టాక్ రావడానికి కారణమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే ఆశించిన స్థాయిలో వసూళ్లు చేయడంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ విఫలమైందనే చెప్పాలి. సక్నిల్క్ అంచనాల ప్రకారం.. గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డే 1 రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడింది. కానీ, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక రెండో రోజు నుంచి గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ తగ్గాయి. రెండో రోజు గేమ్ చేంజర్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 21.6 కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక మూడో రోజు కలెక్షన్లు కూడా తగ్గాయి. మూడు రోజు రూ.17 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది.

ఇక నాలుగవ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. సోమవారం (జనవరి 13)నాడు గేమ్ ఛేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 8.50 కోట్లు అందుకుంది . దీంతో మొత్తం నాలుగు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.97 కోట్లకు చేరుకుంది. గేమ్ ఛేంజర్ సోమవారం నాడు తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 20.58% గా నమోదైంది.
ఇందులోమార్నింగ్ షోల్లో స్వల్పంగా 12.79 శాతం నమోదు కాగా.. సాయంత్రం షోలు 25.07%కి స్వల్పంగా పెరిగింది. ఇక హిందీ వెర్షన్ థియేటర్ ఆక్యుపెన్సీ కి వస్తే.. దాదాపు 8.16 % సొంతం చేసుంది. తమిళ వెర్షన్ 14.22% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కలెక్షన్ల పై బాలయ్య డాకుమహారాజ్ ఎఫెక్ట్ కూడా తీవ్రంగా పడినట్టు తెలుస్తోంది. అలాగే విక్టరీ వెంకీ ' సంక్రాంతికి వస్తున్నాం' పాజిటివ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ రెండు సినిమాల ప్రభావం పడినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











