Game Changer Day 8 Collection : మారని గేమ్ ఛేంజర్ కథ .. చరణ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేసిన చిత్రమే గేమ్ ఛేంజర్ . సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ మధ్య తన ప్రయాణం సాగిస్తోంది. ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్ తర్వాత మాత్రం పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో 8వ రోజు రామ్ చరణ్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ఫిలింనగర్ టాక్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో నైజాంలో రూ. 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే 145 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది గేమ్ ఛేంజర్. తద్వారా 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అయితే స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ఆ తర్వాత రెండో రోజు నుంచి గేమ్ ఛేంజర్ వసూళ్లు పడిపోతూ, మధ్యలో లేస్తూ సాగుతోంది. రెండో రోజు రూ.21.6 కోట్లు, మూడో రోజు రూ. 17 కోట్లు, నాలుగో రోజు రూ. 8.50 కోట్లు, ఐదవ రోజు రూ. 10.19 కోట్లు, ఆరవ రోజు రూ. 7.11 కోట్లు , 7వ రోజు రూ. 4.5 కోట్లు వసూలు చేసింది.

గేమ్ ఛేంజర్ విడుదలయ్యాక ఇదే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్‌ల సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని ఏరియాల్లో చరణ్ మూవీపై బాలయ్య, వెంకీ సినిమాల ఇంపాక్ట్ పడుతోందని అంటున్నారు విశ్లేషకులు. మిక్స్‌డ్ టాక్, నెగిటివిటీ వస్తున్నా రామ్ చరణ్ తన ఛరిష్మా చూపిస్తున్నాడు. అయితే ఆదుకుంటుంది అనుకున్న హిందీ బెల్ట్ కూడా ఇప్పుడు చేతులెత్తేస్తూ ఉండటంతో గేమ్ ఛేంజర్ యూనిట్ టెన్షన్ పడుతోంది.
ఇకపోతే.. గేమ్ ఛేంజర్ 8వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లు, తమిళ్‌లో రూ.20 లక్షలు, హిందీలో రూ. 46 లక్షలు , కర్ణాటక , కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 26 లక్షలు చొప్పున మొత్తంగా రూ.2.87 కోట్ల వసూళ్లను రాబట్టాడు రామ్ చరణ్. ఇంకా గేమ్ ఛేంజర్ ముందు కొండంత లక్ష్యం ఉండగా .. ఫైనల్‌గా చెర్రీ ఎన్ని కోట్లు రాబడతాడనేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











