Game Changer Day 4 Box Office: గేమ్ చేంజర్ మైండ్ బ్లాంక్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?
Game Changer Day 4 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. కానీ, రోజురోజుకు కలెక్షన్స్ తగ్గుతున్నాయనేది? వాస్తవం. అయితే.. ఇప్పటి వరకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ( Game Changer) మూవీ ఎన్ని కోట్లు వసూల్లు చేసింది? నేడు నాలుగోవ రోజు రోజు ( Game Changer Day 4 expected collections) కలెక్షన్ వివరాల్లోకెళ్తే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ( Game Changer) మూవీ భారీ అంచనాలు విడుదలైంది. ఈ మూవీలో రామ్ చరణ్ కథనాయకుడుగా నటించగా.. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. అలాగే.. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కథ, కథనం సరిగా లేదనీ ప్రేక్షకులు తేల్చేశారు. కథను తెరకెక్కించిన విధానం సరిగా లేదనీ మెగా ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. ఫ్యాన్స్ నాడీ పట్టుకోవడంలో., సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తుంది. సెకండాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా ఉందనీ, సగటు అభిమానిని ఎంటర్టైన్ చేయడంతో శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారని అభిమానాలు ఫైర్ అవుతున్నారు. అలాగే..'నానా హైరానా' సాంగ్ ను ఫస్ట్ రోజే యాడ్ చేయకపోవడం కూడా నెగిటివ్ టాక్ రావడానికి కారణమంటున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. సక్నిల్క్ సంస్థ అంచనాల ప్రకారం.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి డే 1 రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక రెండో రోజు నుంచి గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది. రెండో రోజు నాడు గేమ్ చేంజర్ ఇండియాలో రూ. 21.6 కోట్ల కలెక్షన్స్, మూడు రోజు రూ.17 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నటు తెలుస్తోంది.

నాలుక రోజైన సోమవారం (జనవరి 13)న గేమ్ ఛేంజర్ ఇప్పటి వరకు రూ. 2.92 కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మొత్తం నాలుగు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు 91.42 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పటి వరకు మార్నింగ్ , మాట్నీ షోల వివరాలు మాత్రమే.. ఇక ఫస్ట్ షో. రెండవ షో కలెక్షన్స్ వివరాలు రాలేదు. ఈ రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది. గేమ్ ఛేంజర్ కలెక్షన్ల పై బాలయ్య డాకుమహారాజ్ ఎఫెక్ట్ కూడా తీవ్రంగా పడినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











