Game Changer Day 5 Box Office: పుంజుకున్న గేమ్ చేంజర్ కలెక్షన్లు.. 5 రోజుల్లో ఆ క్లబ్‍లోకి..

Game Changer Day 5 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్స్ తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ ( Game Changer). ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాపంగా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. గత రెండు కలెక్షన్స్ తగ్గిన 5 రోజు కలెక్షన్స్ పెరిగాయి. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ ( Game Changer) మూవీ ఎన్ని కోట్లు వసూల్లు చేసింది? ఐదవ రోజు (Game Changer Day 5 collections) కలెక్షన్ వివరాలిలా ..

రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్‌ (Game Changer). ఈ మూవీలో రామ్ చరణ్ హీరో గా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్ , జయరామ్, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్ వేల్మురుగన్ స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ ఎస్ స్వరాలు సమకూర్చారు.. ఎన్నడు లేని విధంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అలాగే.. గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగింది.

Ram charan kiara advani s Game Changer Box Office Day 5 collections report

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ' గేమ్ ఛేంజర్ 'సినిమా ప్రీమియర్స్ షో నుంచే మిక్స్‌డ్ టాక్‌ అందుకుంది. కథ, కథనం సరిగా లేదనీ , సినిమాను సగటు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ శంకర్ విఫలమయ్యారని, ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారని మెగా ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. అలాగే..'నానా హైరానా' సాంగ్ ను ఫస్ట్ డే నుంచి యాడ్ చేయకుండా..ప్రేక్షకులను నిరాశ పరిచారని ఇలా పలు కారణాల వల్ల గేమ్ ఛేంజర్ నెగిటివ్ టాక్ వచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే .. ఆశించిన విధంగా కలెక్షన్స్ అందుకోవడంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. సక్నిల్క్ అంచనాల ప్రకారం.. గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డే 1 రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడింది. కానీ, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక రెండో రోజు రూ. 21.6 కోట్లు,మూడు రోజు రూ.17 కోట్టు, నాలుగవ రోజు రూ. 8.50 కోట్లు వసూలు చేసింది గేమ్ ఛేంజర్.

Ram charan kiara advani s Game Changer Box Office Day 5 collections report

ఇక ఐదవ రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. Sacnilk అంచనా ప్రకారం మంగళవారం (జనవరి 14)నాడు గేమ్ ఛేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 10.19 కోట్లు వసూలు చేసింది. ఈ అంచనాల బట్టి చూస్తే.. నాలుగవ రోజు కలెక్షన్స్ కంటే ఐదవ రోజు కలెక్షన్స్ 33.20 శాతం పెరిగాయి. అలాగే.. స్టేట్ వైస్ చూస్తే.. 5 రోజు తెలుగులో ₹ 6.3 కోట్లు, హిందీలో ₹ 2.94 కోట్లు, తమిళంలో ₹ 0.95 కోట్లు వసూలు చేసింది. దీంతో గేమ్ ఛేంజర్ ఐదు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.106.34 కోట్లకు చేరుకుంది.

వాస్తవానికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై మూవీ మేకర్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ, బాలయ్య డాకుమహారాజ్ కు మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్సాన్స్ వస్తుండటం. విక్టరీ వెంకటేష్ ' సంక్రాంతికి వస్తున్నాం' పాజిటివ్ సొంతం చేసుకోవడం, మరోవైపు.. ఫైరసీ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ కలెక్ష్లన్లపై పడటంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. అంతే కాకుండా నెగిటివ్ రివ్యూస్, నెటిగివ్ టాక్ కూడా గేమ్ ఛేంజర్ మూవీపై పడిందని ట్రేడ్ వర్గాలపై పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X