Game Changer Day 7 Box Office: షాకింగ్‌గా గేమ్ ఛేంజర్ కలెక్షన్లు.. గేమ్ ఛేంజర్ 7 వ రోజు ఎన్ని కోట్లంటే?

Game Changer Day 7 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్.
వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్-కియారా అద్వానీ లు ఈ సినిమాలో జంటగా నటించారు. పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే..ఇప్పటివరకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే ? వారం రోజుల్లో (Game Changer Day 7 collections) కలెక్షన్ వివరాల్లోకెళ్తే..

మెగా హీరో రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్‌ (Game Changer). ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రగని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్ వేల్మురుగన్ స్క్రీన్ ప్లే అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. RRR లాంటి భారీ హిట్ అందుకున్న రామ్ చరణ్ సోలోహీరో మూవీ కావడం, సక్సెస్ పుల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రావడంతో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగాయి.

Ram charan kiara advani s Game Changer Box Office Day 7 collections report

2025 సంక్రాంతి రేసులో మొట్ట మొదటగా బరిలోకి దిగిన గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్స్ పరంగా రోజురోజుకు చతికిలపడినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ కంటే ముందుగా జనవరి 10న విడుదల అయిన గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్ రోజు రోజు తగ్గుముఖం పడుతున్నాయి. మూవీ కలెక్షన్లపై నెలకొన్న అంచనాలను ఏమాత్రం అందుకోవడం లేదని వాస్తవమే.

గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. గేమ్ ఛేంజర్ మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ నెట్ కలెక్షన్ ప్రకారం.. మొదటి రోజు రూ. 51 కోట్ల నికర వసూళ్లను సాధించింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు రూ. 21.6 కోట్లు, మూడు రోజు రూ.17 కోట్టు, నాలుగవ రోజు రూ. 8.50 కోట్లు, ఐదవ రోజు రూ. 10.19 కోట్లు, ఆరవ రోజు రూ. 7.11 కోట్లు వసూలు చేసింది గేమ్ ఛేంజర్.

Ram charan kiara advani s Game Changer Box Office Day 7 collections report

ఇక ఏడో రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. Sacnilk ప్రకారం గురువారం (జనవరి 16) గేమ్ ఛేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 4.75 కోట్లు రాబట్టింది. దీంతో గేమ్ ఛేంజర్ ఏడు రోజుల్లో గేమ్ ఛేంజర్ నికర వసూళ్లు రూ. 117.90 కోట్లకు చేరుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా వారం రోజుల్లో రూ. 195 కోట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలల్లో 18.02 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా.. తమిళంలో 23.79 శాతం ఆక్యుపెన్సీ, హిందీలో 6.04 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. గేమ్ ఛేంజర్ .. మూవీపై డాకుమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు.. ఫైరసీ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ కలెక్ష్లన్లపై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X