Peddi Business: ‘పెద్ది'కి రికార్డు డీల్.. రామ్‌చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'పెద్ది'(Peddi). ఈ మూవీ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్, ఎమోషన్ మేళవింపుగా రూపొందించబడిన ఈ చిత్రం, థియేటర్లలోకి రాకముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన వివరాల ప్రకారం.. ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ ఆదాయం సాధించి నిర్మాతలను ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా నిజాం ఏరియాలో కూడా రికార్డు స్థాయిలో డీల్ కూరినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ డీల్ ఎన్ని కోట్లంటే?

రామ్ చరణ్ -బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.'పెద్ది' ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా రిలీజ్‌కు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Ram Charan movie Peddi Creates History 63Cr Nizam Deal Seals Massive Pre-Release Buzz

ముఖ్యంగా డిజిటల్ రైట్స్ విషయంలో 'పెద్ది' భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫిక్స్ (Netflix) మూవీ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషలకు కలిపి ఈ డీల్ రూ.130 కోట్లు వెచ్చినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. అదనంగా, సినిమా ప్లాట్‌ఫామ్‌పై భారీ విజయాన్ని సాధిస్తే రూ.20 కోట్ల 'పర్న్స్ బోనస్' కూడా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.

మ్యూజిక్ పరంగా కూడా ఈ పెద్ది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆస్కార్ విజేత ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు వచ్చిన స్పందన సినిమాపై బజ్‌ను మరింత పెంచుతోంది.ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-Series ఏకంగా రూ.35 కోట్లకు ఆడియో హక్కులను సొంతం చేసుకుందట. ఇప్పటికే విడుదలైన 'చికిరి' సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలవడం, తాజాగా వచ్చిన 'రై రై రారా' పాటకు మంచి స్పందన రావడం సినిమాపై బజ్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ.275 కోట్ల మార్క్‌ను దాటినట్లు అంచనా.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'పెద్ది' క్రేజ్ మామూలుగా లేదు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్‌కు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించినందున, ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.40 కోట్లకు పైగా అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అదే సమయంలో, థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతోంది.

ముఖ్యంగా నిజాం ఏరియాలో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉన్న 'పెద్ది' (Peddi) నిజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఒక కొలిక్కి వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, పంపిణీదారుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం, నిజాం ఏరియా హక్కులు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడైనట్లు సమాచారం. చివరకు ఈ హక్కులు మైత్రి మూవీ మేకర్స్ చేతికి రూ.63 కోట్ల భారీ మొత్తానికి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుత మార్కెట్లో ఇది అత్యంత పెద్ద డీల్స్‌లో ఒకటిగా ఉంది. అయితే.. టికెట్ ధరలు పెరగకపోతే ఈ డీల్ విలువలో 10-15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' ఫలితం ఎలా ఉన్నా, రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని 'పెద్ది' ప్రీ-రిలీజ్ బిజినెస్ స్పష్టంగా చూపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకున్న క్రేజ్, గ్లోబల్ ఇమేజ్ ఈ స్థాయి బిజినెస్‌కు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక విడుదల విషయానికి వస్తే, ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా ఈ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ డేట్‌పై ఇంకా కొంత అనిశ్చితి కొనసాగుతోంది.

అయినప్పటికీ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలు పెట్టడానికి వెనకాడటం లేదు. 'పెద్ది' సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల వర్షం కురిపిస్తూ ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాన్-థియేట్రికల్ బిజినెస్‌తోనే రికార్డు మార్క్‌ను టచ్ చేసిన ఈ మూవీ, థియేటర్లలో విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X