‘నాయక్’ 3డేస్ ఏపీ కలెక్షన్స్ ఎంతంటే..?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'నాయక్' చిత్రం దుమ్ము రేపే కలెక్షన్లతో దూసుకెలుతోంది. సంక్రాంతి సీజన్ కావడం, పోటీగా ఒకే ఒక పెద్ద సినిమా బరిలో ఉండటంతో వసూళ్లు బాగానే వస్తున్నాయి. తొలిరోజు నాయక్ చిత్రం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 10 కోట్లు చేరువయ్యేలా డబ్బులు రాబట్టి రికార్డు సృష్టించింది. థియేటర్లు భారీగా కేటాయించడం కూడా ఈ రేంజిలో కలెక్షన్లకు కారణం అవుతోంది.
తొలి రెండు రోజులు 9, 10 తేదీల్లో భారీగా థియేటర్లు కేటాయించారు. దీంతో రెండు రోజులు బీభత్సమైన వసూళ్లు వచ్చాయని ట్రేడ్ టాక్. అయితే 11వ తేదీన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం విడుదలవ్వడంతో కొన్ని మూడో రోజు 'నాయక్' థియేటర్ల సంఖ్య తగ్గింది.
తొలి మూడు రోజులను కలుపుకుని ఏపీలో 'నాయక్' కలెక్షన్స్ క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం-5.05 కోట్లు
సీడెడ్-2.84కోట్లు
నెల్లూరు-67 లక్షలు
గుంటూరు-1.72 కోట్లు
కృష్ణ-83 లక్షలు
వెస్ట్ గోదావరి-1.11 కోట్లు
ఈస్ట్ గోదావరి-1.13 కోట్లు
వైజాగ్-1.52 కోట్లు
మూడు రోజుల్లో మొత్తం ఏపీ షేర్-14.87 కోట్లు
'నాయక్' సినిమా తొలి మూడు రోజులు (బుధ, గురు, శుక్ర) సాధారణ వర్కింగ్ డేస్. ఇలాంటప్పుడే ఈ రేంజిలో కలెక్షన్స్ వచ్చాయంటే వీకెండ్ హాలిడేస్, పండగ హాలిడేస్ కలుపుకుంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదిరిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు. మరి తొలి వారం ముగిసే నాటికి 'నాయక్' ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











