నైజాంలో రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్ 'నాయక్‌'

By Srikanya

హైదరాబాద్: రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాయక్‌'. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. సంక్రాంతి కాకుకగా విడుదల అవుతున్న ఈ చిత్రంపై హై ఎక్సపెక్టేషన్స్ ఇటు ప్రేక్షకులలోనూ,అటు ట్రేడ్ లోనూ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రం నైజాం రైట్స్ పదకొండు కోట్లకు అమ్ముడై కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. దిల్ రాజు..నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ ఏ చిత్రమూ ఈ రేంజి లో నైజాం బిజినెస్ జరగలేదు. చిత్రంపై ఉన్న దిల్ రాజుకు ఉన్న నమ్మకమే ఈ రేటుకి ఇవ్వటానికి సిద్దపడ్డారని తెలుస్తోంది.

అలాగే రామ్ చరణ్ కి నైజాంలో మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చిరంజీవికి గతంలో నైజాం కంచుకోట. ఇక్కడ వచ్చే కలెక్షన్స్ ఎక్కడా వచ్చేవి కాదు. ఇప్పుడు అదే హవాని రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. దీనికి తోడు మసాలాలు సమపాళ్ళలో దట్టించి వదలటంతో వినాయిక్ ని మించిన వారు లేరు. ఇవన్నీ ఈ సినిమాకు ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసారు. ఇక మొదట దిల్ రాజుతో గీతా ఆర్ట్స్ వారు కలుస్తారనుకున్నారు. కానీ చివరి నిముషంలో వారు తప్పుకోవటంతో పూర్తిగా దిల్ రాజు తాను ఒక్కడే ఈ చిత్రం నైజాం బిజినెస్ చూసుకుంటున్నారు.

అన్ని విభాగాలు కలుపుకుని మొత్తం 42 కోట్లు దాకా బడ్జెట్ అవుతోందని చెప్పబడుతున్న ఈ చిత్రంలో చరణ్‌ పాత్ర రెండు విభిన్నమైన కోణాల్లో సాగుతుంది.నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న ఓ యువకుడి కథ ఇది. 'శుభలేఖ రాసుకొన్నా...' గీతాన్ని రీమిక్స్‌ చేశారు. ఆ పాటలోని లొకేషన్లు అబ్బురపరుస్తాయి. తమన్‌ మంచి బాణీలను అందించారు.

చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌ చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము'' అన్నారు.

జిలేబి పాత్రలో బ్రహ్మానందం కనిపించే ఈ చిత్రంలో వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X