»   » రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ డిజాస్టరైనా భారీగానే కలెక్షన్స్

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ డిజాస్టరైనా భారీగానే కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ల హీరోయిల సినిమాలకు భారీగా బడ్జెట్ ఖర్చు చేస్తారు. సాధారణంగా ఈ స్టార్ల సినిమాలు ఫస్ట్ రోజే డిజాస్టర్ టాక్ వస్తే రూ. 20 కోట్లకు మించి వసూలు చేయడం గగనమే.

రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' అక్టోబర్ 16న విడుదలైంది. సినిమా విడుదలైన ఫస్ట్ వీకెండ్ డిజాస్టర్ అయి తేలిపోయింది. ఓవర్సీస్ మార్కెట్లో భారీగా విడుదలైన ఈచిత్రం అక్కడి ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. ఈ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.


Ram Charan's Bruce Lee total share of 41

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బ్రూస్ లీ' మూవీ బిజినెస్ దాదాపుగా ముగిసిందనే అంటున్నారు. సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 41 కోట్లు షేర్ రాబట్టినట్లు టాక్. ఇండియాలో ఈ సినిమా దాదాపు 25 శాతానికిపైగా నష్టాలను మిగిల్చిందని టాక్. ఇక ఓవర్సీస్ లో 50 శాతానికి పైగా నష్టపోయారు డిస్ట్రిబ్యూటర్లు. ఓవరాల్ గా లాస్ పర్శంటేజ్ 30 శాతం ఉంటుందని ట్రేడ్ టాక్.


అయితే డిజాస్టర్ టాక్ లోనూ రామ్ చరణ్ సినిమా రూ. 41 కోట్లు వసూలు చేయడం హాట్ టాపిక్ అయింది. రామ్ చరణ్ ఖాతాలో 40 కోట్ల మార్కును అందుకున్న 6వ సినిమా ఇది అని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన భార్యతో విదేశీ పర్యటనలో ఉన్నారు. నెల రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ రానున్నాడు.

English summary
Ram Charan's Bruce Lee - The Fighter which released on Oct 16th sadly opened to disaster talk and it has collected a share of 41 crores and lapped a loss of 25% in India and 50% losses overseas, summing up to an overall 30% losses which does not make it a disaster.
Please Wait while comments are loading...