జపాన్‌లో మగధీర కలెక్షన్ల మోత.. బాహుబలి, ముత్తు రికార్డులు తుక్కుతుక్కు!

By Rajababu

సెన్సేషనల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రాంచరణ్, గ్లామర్ క్వీన్ కాజల్ అగర్వాల్ నటించిన మగధీర చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొన్నది. 2009లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. 21 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జపాన్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం జపాన్‌లో కలెక్షన్ల మోత మోగిస్తున్నది.

జపాన్‌లో భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటి వరకు 1.77 మిలియన్ డాలర్లను (సుమారు రూ.13 కోట్లు) కలెక్ట్ చేసింది. గతంలో రజనీకాంత్ చిత్రం ముత్తు నెలకొల్పిన రికార్డులను అధిగమించింది. ఇటీవల విడుదలై 1.2 మిలియన్లు వసూలు చేసిన బాహబలి కలెక్షన్లను కూడా మగధీర తిరగరాసింది.

Ram Charans Magadheera a Super hit in Japan

తొలివారంలో మగధీర చిత్రం కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించింది. గత ఏడురోజులుగా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో పరుగులు పెడుతున్నది. వచ్చేవారంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అప్పట్లో మగధీర చిత్రం 35 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.150 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహారించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. ఆ తర్వాత మలయాళం, తమిళం భాషల్లోకి అనువాదమై ఘన విజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X