twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్ వర్సెస్ మహేష్‌బాబు: 200 కోట్ల క్లబ్‌లో రంగస్థలం.. వేటాడుతున్న భరత్..

    By Rajababu
    |

    2018 ఆరంభంలో టాలీవుడ్‌‌‌‌కు అన్నీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. స్టార్ హీరోల సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడంతో పరిశ్రమ వర్గాలు నిరాశకు గురయ్యాయి. పవన్ కల్యాణ్ నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందడం, ఆ తర్వాత వచ్చిన మిగిలిన సినిమాలు కూడా అంతగా ఆడకపోవడంతో మంచి హిట్ కోసం ఇండస్ట్రీ ఎదురుచూసింది.

    Recommended Video

    'Bharath Ane Nenu' Movie Collections
    200 కోట్ల క్లబ్‌లో రంగస్థలం

    200 కోట్ల క్లబ్‌లో రంగస్థలం

    వరుస పరాజయాల మధ్య వచ్చిన రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు టాలీవుడ్‌కు ఊరట కలిగించాయి. గ్రామీణ కథా నేపథ్యంతో వచ్చిన రంగస్థలం బ్లాక్‌బస్టర్‌గా నిలువడమే కాకుండా రూ.200 కోట్లు వసూలు చేసింది.

    నాన్ బాహుబలి క్యాటగిరిలో

    నాన్ బాహుబలి క్యాటగిరిలో

    ఇప్పటివరకు టాలీవుడ్‌లో కలెక్షన్ల పరంగా బాహబలిదే అగ్రస్థానం. నాన్ బాహుబలి విభాగంలో ఖైదీ నంబర్ 150 చిత్రం సుమారు రూ.160 కోట్లకుపైగా వసూళ్లతో టాప్ పొజిషన్‌లో నిలిచింది. ప్రస్తుతం ఆ చిత్ర రికార్డును అధిగమించడమే కాకుండా రూ.200 కోట్లు క్లబ్ చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

    నైజాం, ఏపీ కలెక్షన్లు

    నైజాం, ఏపీ కలెక్షన్లు

    రంగస్థలం చిత్రం నైజాంలో సుమారు 40 కోట్లు గ్రాస్ (25 కోట్లు నికర) కలెక్షన్లను రాబట్టింది. ఆంధ్రలో ఈ చిత్రం సుమారు 65 కోట్లు గ్రాస్ (40 కోట్లకుపైగా నికర) వసూళ్లను సాధించంది. సీడెడ్‌లో గ్రాస్ 22 కోట్లు (షేర్ 15 కోట్లు) గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

    ఓవరాల్ కలెక్షన్లు

    ఓవరాల్ కలెక్షన్లు

    నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో మొత్తం 125 కోట్ల గ్రాస్‌ (78.07)ను కలెక్ట్ చేయగా, అమెరికాలో 22 కోట్లకుపైగా (13.2 కోట్ల షేర్) గ్రాస్, కర్ణాటకలో రూ.8 కోట్లకుపైగా షేర్, రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.

    80 కోట్లకు థియేట్రికల్ రైట్స్

    80 కోట్లకు థియేట్రికల్ రైట్స్

    రంగస్థలం థియేట్రికల్ హక్కులను సుమారు 80 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఈ చిత్ర ప్రపంచవ్యాప్తంగా సుమారు 125 కోట్లు షేర్ (200 కోట్ల గ్రాస్) సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    రంగస్థలం వెనుకే భరత్ అనే నేను

    రంగస్థలం వెనుకే భరత్ అనే నేను

    ఇదిలా ఉండగా, ఇటీవల రిలీజైన భరత్ అనే నేను చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 162 కోట్లు వసూలు చేసినట్టు నిర్మాత దానయ్య ప్రకటించారు. త్వరలోనే ప్రిన్స్ మహేష్ చిత్రం కూడా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

    English summary
    The film Rangasthalam, starring Ram Charan has earned Rs 200 crore from the worldwide box office. It is said that the film will collect the maximum amount in Telugu cinema after Baahubali series. The success of Rangathalam was followed by Mahesh Babu's Bharat Ane Nenu which crossed Rs 125 crore mark in a very short span. Now, the film industry is awaiting the release of All Arjun's Naa Peru Surya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X