For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ 'తుఫాన్' ఫైనల్ టాక్

  By Srikanya
  |

  హైదరాబాద్ : అపూర్వ లాఖియా దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రకాశ్ మెహ్రా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించగా రామ్ చరణ్ హీరోగా నటించిన 'తుఫాన్' (హిందీ 'జంజీర్'కు తెలుగు వెర్షన్) శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. సినిమాపై సీమాంధ్ర ఉద్యమం ప్రభావం కొన్ని చోట్ల కనిపించగా, ఎక్కువ చోట్ల ప్రశాంతంగా ఆటలు నడుస్తున్నాయి. అయితే కలెక్షన్స్ మాత్రం లేవని టాక్. శుక్రవారం మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ రావటంతో ఈ చిత్రానికి మెల్లిగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దానికి తోడు శనివారం నాడు హైదరాబాద్ లో సమైకాంధ్ర సభ జరగటంతో ఈ చిత్రం పై ఆ ఎఫెక్టు పూర్తి స్ధాయిలో కనిపించింది. బాలీవుడ్ లోనూ సినిమాకు దారుణమైన రివ్యూలు వచ్చాయి. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చింది.

  రామ్ చరణ్ మాట్లాడుతూ..."'జంజీర్'కు స్పందన చాలా బాగుంది. మంచి సినిమా చూశామని చాలా మంది చెబుతున్నారు. 'తుఫాన్'కి సంబంధించి విడుదలకు ఏమైనా అడ్డంకులు ఉంటాయేమోననుకున్నాం కానీ ఇక్కడా మంచి రిలీజ్ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి సినిమా కంటే పెద్దది. అందువల్లే కొన్ని చోట్ల మార్నింగ్ షో పడలేదు. మ్యాట్నీ నుంచయినా పడినందుకు హ్యాపీ.మేమనుకున్న దాని కంటే తక్కువ గొడవలు జరగడం సంతోషించదగ్గ విషయమే. ఈ గొప్పతనం ప్రజలదే. 'తుఫాన్' విడుదల వల్ల ఎక్కువ శాతం ప్రజలు సినిమానీ, రాజకీయాల్నీ వేరు వేరుగానే చూస్తున్నారని అర్థమైంది'' అని చెప్పారు .

  Ram Charan's Thoofan talk

  అలాగే కథలో కానీ, ఎడిట్‌లో కానీ హిందీకీ, తెలుగుకూ ఒకే రకమైన ఫీడ్ బ్యాక్ వచ్చింది. తెలుగులో మాత్రం డాన్సులు తక్కువయ్యాయని అంటున్నారు. రామ్‌చరణ్ అంటే డాన్సులు ఆశిస్తారు కదా. కేరక్టర్‌ను, కథను నమ్మి ఈ సినిమా చేశాం. పేరుపొందిన విమర్శకులు, విశ్లేషకులు 'రామ్‌చరణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు' అంటుంటే సంతోషంగా ఉంది. బాలీవుడ్ పరిచయం చాలా సంతృప్తినిచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఆశించలేదు నేను. ఒక తెలుగువాడిగా బాలీవుడ్‌కి వెళ్లినందుకు, తెలుగువాళ్లెవరూ అసంతృప్తి చెందని రీతిలో స్పందన వచ్చిందని గట్టిగా చెప్పగలను అని అన్నారు.

  ఇక అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప నటుడు చేసిన పాత్రను చేయాలను కోవడం ఒక రకంగా సాహసమే. కానీ ఒక విషయానికి భయపడి చెయ్యకుండా ఉండకూడదని నాన్నగారు చెప్పారు. దాంతో ధైర్యంగా చేశాను. పైగా ఇది అమితాబ్ గారు చేసి నలభై ఏళ్లయింది. సరిగ్గా 1973లో ఆయన 'జంజీర్' రిలీజయ్యింది. నేను ఎనభైలలో పుట్టినవాణ్ణి. నా తరానికి సంబంధించిన వాళ్లలో చాలా మందికి దాని గురించి ఎక్కువగా తెలీదు. అందువల్ల కూడా ఈ సినిమా చేయడానికి ధైర్యం చేశాను. దర్శకుడు అపూర్వ లాఖియా కూడా నేటి ప్రేక్షకులకు తగ్గట్లు కథను సమకాలీనం చేసి తీశారు అని అన్నారు.

  English summary
  Ram Charan Teja's latest outing Thoofan, which is simultaneously made in Hindi, is a remake of 1973 Hindi action-thriller film Zanjeer relesed with flop talk on friday. Set in the backdrop of oil mafia, the movie revolves around the life of a police office, who takes revenge against the brutal murderers of his family. Ram Charan and Priyanka Chopra are essaying the roles of Amitabh and Jaya Bachchan portrayed in the original. Along with Suresh Nair, Apoorva Lakhia, who is directing Thoofan, has written the story and screenplay for the modern version of Zanjeer. Sticking to the original theme, the director has made several changes in the script to suit the taste of present generation. He has also made use of adequate technology to make the film look quite different from the original and fresh to the viewers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X