ఓ వైపు డిజాస్టర్ టాక్.. మరోవైపు డీసెంట్ కలెక్షన్లు... రాంచరణ్ స్టామినా అంటే ఇదే..

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య‌విధేయ‌రామ‌. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మించిన భారీ చిత్ర‌మిది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద స‌త్తా చాటింది. సంక్రాంతి రేసులో మంచి కలెక్షన్స్ తో రాణిస్తున్న ఈ సినిమా గురించి...

తొలి ఆట నుంచే నెగిటివ్‌గా

తొలి ఆట నుంచే నెగిటివ్‌గా

వినయ విధేయ రామ తొలి ఆట నుంచి నెగిటివ్ రివ్యూలు, టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల సాధిస్తున్నది. ఐదో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.5.24 కోట్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్‌ను సాధించింది.

 తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

ప్రాంతాల వారీగా వినయ విధేయ రామ ఐదు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. నైజాంలో రూ.10.56 కోట్లు, సీడెడ్ రూ.9.98 కోట్లు, నెల్లూరులో రూ.2.36 కోట్లు, గుంటూరులో రూ.5.57 కోట్లు, కృష్ణాలో రూ.2.80 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3.02 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.4.88 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.42.66 కోట్లు రాబట్టింది.

యూఎస్ కలెక్షన్లు

యూఎస్ కలెక్షన్లు

వినయ విధేయ రామ చిత్రానికి అమెరికాలో గట్టి దెబ్బ తగిలింది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద 3 లక్షల డాలర్లు వసూలు చేసినట్టు సమాచారం. అంటే సుమారు రూ.2 కోట్లు వసూలు చేసి నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటక ఇతర రాష్ట్రాలతో కలుపుకొంటే ఈ చిత్రం రూ.50.31 కోట్లు వసూలు చేసింది.

నిర్మాత దానయ్య ఏమన్నారంటే

నిర్మాత దానయ్య ఏమన్నారంటే

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచరణ్ చిత్రం అదీ కూడా బోయ‌పాటి శ్రీనుగారి ద‌ర్శ‌క‌త్వంలో అని తెలియ‌గానే సినిమాపై భారీ అంచ‌నాలుంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాం. అలాగే హీరోను మాస్ యాంగిల్‌లో ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీనుగారు ప్ర‌జెంట్ చేశారు అని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత డి.వి.వి.దాన‌య్య తెలిపారు.

ఆదరిస్తున్న ప్రేక్షకులకు

ఆదరిస్తున్న ప్రేక్షకులకు

అన్న‌ద‌మ్ములు మ‌ధ్య అనుబంధం, ఫ్యామిలీ ఎమోష‌న్స్ కుటుంబ క‌థా చిత్రాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అలాగే ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఏపిసోడ్స్, డ్యాన్సులకు మాస్ ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యారు. సినిమా స‌క్సెస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళ్తోంది. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్ష‌కుల‌కు, స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌ అని దానయ్య అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X