twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినయ విధేయంగా ‘ఒక్కడే ప్రేక్షకుడు’.. మెగా హీరోకు చేదు అనుభవం!

    By Krishna
    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు రంగస్థలం చిత్రం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. స్టార్‌గానే కాకుండా ఫెర్ఫార్మర్‌గా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో బోయపాటి రూపొందించిన వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టే రిలీజ్‌కు ముందు భారీగా బిజినెస్ జరిగింది. అయితే ఇప్పటి వరకు రాంచరణ్‌కు వసూళ్ల అడ్డగా మారిన యూఎస్‌లో చేదు అనుభవమే మిగిలింది. వివరాల్లోకి వెళితే..

    ఒక్క టికెట్.. ఒకే ప్రేక్షకుడు

    ఒక్క టికెట్.. ఒకే ప్రేక్షకుడు

    అమెరికాలో వినయ విధేయ రామ బాక్సాఫీస్ కథ ముగిసింది. శనివారం రోజున దారుణమైన పరిస్థితి కనిపించిందట. థియేటర్‌లో ఒకే ఒక ప్రేక్షకుడు ఉండగా సినిమా నడించిందట. దాంతో కేవలం 13 డాలర్లు మాత్రమే వసూలయ్యాయని ఓ వెబ్‌సైట్ కథనాన్ని వెలువరించింది. దాంతో మెగా హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

    యూఎస్‌లో భారీ నష్టాలు

    యూఎస్‌లో భారీ నష్టాలు

    యూఎస్‌లో థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని రూ.1.8 మిలియన్లు వెచ్చింది కొనుగోలు చేశారు. మొదటి ఆట నుంచే ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరచడంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. చివరకు 2.53 లక్షల డాలర్ల వద్ద బాక్సాఫీస్ రిపోర్టు ముగిసింది. దీంతో బయ్యర్లను భారీగా నష్టాల్లో ముంచెత్తింది.

    నా దృష్టిలో, ఫాన్స్ దృష్టిలో బాబాయి ఇలాగే ఉంటాడు: రామ్ చరణ్ పోస్ట్ వైరల్నా దృష్టిలో, ఫాన్స్ దృష్టిలో బాబాయి ఇలాగే ఉంటాడు: రామ్ చరణ్ పోస్ట్ వైరల్

    పండగ సీజన్లో గౌరవంగా

    పండగ సీజన్లో గౌరవంగా

    వినయ విధేయ రామ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఘనమైన వసూళ్లు సాధించింది. పండుగ సీజన్ కావడంలో మెగా ఫ్యాన్స్ పోటెత్తడంతో గౌరవ ప్రదమైన కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇలాంటి ఫలితం రావడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

    రాంచరణ్‌కు ఇది రెండోసారి

    రాంచరణ్‌కు ఇది రెండోసారి

    మెగా హీరో రాంచరణ్ సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇది రెండోసారి. గతంలో జంజీర్ రీమేక్‌గా వచ్చిన తుఫాన్ కూడా ఇలాంటి ఫలితాన్నే మిగిల్చింది. అయితే యూఎస్ అంతటా ఒకరోజు కేవలం 13 డాలర్ల అంటే కనీసం 1000 రూపాయలు కూడా సాధించకపోవడం మాత్రం చేదు అనుభవంగా మారింది.

    ఫ్లాప్ టాక్ వచ్చినా రూ.95 కోట్లు

    ఫ్లాప్ టాక్ వచ్చినా రూ.95 కోట్లు

    రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన వినయ విధేయ రామ చిత్రం సినీ విమర్శకులు పెదవి విరిచినప్పటికీ సాధారణ ప్రేక్షకులు సినిమాను భుజానకెత్తుకున్నారు. ఈ చిత్రంపై నెగిటివ్ టాక్ వినిపించినప్పటికీ రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బోయపాటి స్టామినాకు నిదర్శనంగా నిలిచింది.

    English summary
    Vinaya Vidheya Rama action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan and Kiara Advani, who made her debut in Tollywood with Bharat Ane Nenu, in the lead roles. Vivek Oberoi stars as the antagonist in this film which also has Prashanth, Aryan Rajesh, Sneha and Ananya in pivotal roles. Devi Sri Prasad has composed the music for the film, while senior producer DVV Danayya is bankrolling this film under the DVV Entertainments banner. This movie released on January 11, 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X