రికార్డుస్థాయిలో వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ బిజినెస్.. రాంచరణ్ స్టామినా అంటే అది..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న వినయ విధేయ రామ భారీ అంచనాలు పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పలు రికార్డులను ఈ చిత్రం క్రియేట్ చేస్తున్నది. సంక్రాంతి బరిలో దూకుతున్న రాంచరణ్ చిత్రం విడుదలకు ముందే బిజినెస్‌పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం సీడెడ్‌లో బిజినెస్
టాలీవుడ్ కలెక్షన్లకు నైజాం అడ్డాగా మారింది. బడా హీరోల సినిమాలకు నైజాంలో వచ్చే వసూళ్లే హింట్ రేంజ్‌ను నిర్ణయిస్తాయి. అలాంటి నైజాం థియేట్రికల్ హక్కులను రూ.24 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఇక సీడెడ్ హక్కులను రూ.14.14 కోట్లకు అమ్మడం జరిగినట్టు సమాచారం.

ఆంధ్రాలో ప్రి-రిలీజ్ బిజినెస్
ఇక ఆంధ్రాలో కూడా వినయ విధేయ రామ బిజినెస్ భారీగా జరిగింది. ఉత్తరాంధ్ర హక్కులను రూ.10.80 కోట్లు, గుంటూరు రూ.8.30 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా రూ.5.60, తూర్పు రూ.6.40 కోట్లు, నెల్లూరు రూ.2.90 కోట్లు, కృష్ణా రూ.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా
తెలుగు రాష్ట్రాల్లో ఏ హీరోకు జరుగని విధంగా వినయ విధేయ రామ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ.77.04 కోట్లు వసూలు చేసింది. మెగా హీరో రాంచరణ్ సినిమాకు ఈ విధంగా బిజినెస్ జరుగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో బిజినెస్
ఇక కర్ణాటకలో కూడా వినయ విధేయ రామ చిత్ర బిజినెస్ భారీగా జరిగింది. కర్ణాటక థియేట్రికల్ హక్కులను రూ.7 కోట్లకు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో బిజినెస్ రూ.1 కోటి, ఓవర్సీస్‌లో థియేట్రికల్ హక్కులను రూ.8 కోట్లకు అమ్ముడుపోయాయి.

మొత్తంగా రూ.141 కోట్లకుపైగా బిజినెస్
వినయ విధేయ రామ సినిమా థియేట్రికల్ హక్కుల మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.93.04 కోట్లకు జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హిందీ డబ్బింగ్ హక్కులను రూ.22 కోట్లు, తెలుగు డిజిటల్ హక్కులు రూ.25 కోట్లు, ఇతర హక్కుల ద్వారా రూ.1.5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్ వెల్లడిస్తున్నది. ఈ సినిమా మొతంగా రూ.141.54 కోట్లకు జరిగినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











