Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
వినయ విధేయ రామ కలెక్షన్లు.. డిస్టిబ్యూటర్లు బయటపడాలంటే.. ఇంకా ఎంతంటే!
రంగస్థలం తర్వాత భారీ అంచనాల మధ్య రిలీజైన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి సెలవులను బాగా క్యాష్ చేసుకొన్నట్టు కనిపిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఆరంభంలో భారీగానే కలెక్షన్లను రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రాలో గత 6 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..
ఆరు రోజుల్లో రూ.62.25 కోట్ల గ్రాస్
గత ఆరు రోజుల్లో వినయ విధేయ రామ కలెక్షన్లు భారీగానే కనపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 62.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్లకు రూ.46.90 మేర ఆదాయం వచ్చినట్టు సమాచారం.
రామ్ చరణ్ మూవీ ఊసే తీయని ఉపాసన... టెక్కీలు, బేబీలతో సంక్రాంతి సంబరం
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను పరిశీలిస్తే గత ఆరు రోజుల్లో నైజాంలో రూ.11.61 కోట్లు, సీడెడ్‌లో రూ.10.68 కోట్లు, వైజాగ్‌లో రూ.5.63 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 4.04 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3.36 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.3.16 కోట్లు, గుంటూరులో రూ.590 కోట్లు నెల్లూరు రూ.2.52 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
72.50 ప్రీ రిలీజ్ బిజినెస్
వినయ విధేయ రామ చిత్రం రూ.72.50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం రాబట్టిన కలెక్షన్లను పరిశీలిస్తే మొత్తంగా 65 శాతం మేర వసూలు చేసినట్టు స్పష్టమవుతున్నది. నైజాం థియేట్రికల్ హక్కులను రూ.18 కోట్లకు, సీడెడ్ హక్కులను రూ.15.30 కోట్లకు, ఆంధ్రా హక్కులను రూ.49 కోట్లకుపైగా అమ్మినట్టు ట్రేడ్ రిపోర్టు.
100 శాతం పెట్టుబడి వస్తుందా?
వినయ విధేయ రామ రిలీజై గురవారానికి ఏడు రోజులు పూర్తవుతుంది. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో నికరంగా రూ.50 కోట్లు సాధించే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ సినిమాల రిలీజ్ లేనందున ఈ సినిమా రెండో వారంలో డిస్టిబ్యూటర్లకు 100 శాతం మేర పెట్టుబడిని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.