Game Changer Day 10 Box Office: వీకెండ్ లో మైండ్ బ్లాంక్ కలెక్షన్స్.. గేమ్ ఛేంజర్ 10 వ రోజు ఎన్ని కోట్లంటే?
Game Changer Day 10 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే.. గేమ్ ఛేంజర్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టడంలో విఫలమైందనే చెప్పాలి. RRR సక్సెస్ అందుకున్న తరువాత భారీ అంచనాలతో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 10 వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
ట్రిపుల్ ఆర్ విజయం తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించగా.. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ప్రమోషన్స్ తో కలిపి మొత్తం రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

గేమ్ ఛేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ డే 1 ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే.. మిక్స్ డ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి గేమ్ ఛేంజర్ వసూళ్లు క్రమంగా పడిపోతున్నాయి. రెండో రోజు రూ.21.6 కోట్లు, మూడో రోజు రూ. 17 కోట్లు, 4వ రోజు రూ.8.50 కోట్లు, 5వ రోజు రూ. 10.19 కోట్లు, 6వ రోజు రూ. 7.11 కోట్లు , 7వ రోజు రూ. 4.5 కోట్లు, 8వ రోజు రూ. 2.75 కోట్లు, 9 వ రోజు రూ. 2.4 కోట్లు వసూలు చేసింది.

ఇక గేమ్ ఛేంజర్ 10 వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.1.86 కోట్లు, తమిళ్‌లో రూ. 11 లక్షలు, హిందీలో రూ. 57 లక్షలు , కర్ణాటక , కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.12 లక్షల చొప్పున మొత్తంగా రూ. 2.54 కోట్ల వసూల్లు రాబట్టింది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ 10 రోజుల్లో ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 125.34 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గేమ్ ఛేంజర్ కు డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మిక్స్‌డ్ టాక్, నెగిటివిటీ వస్తున్నా రామ్ చరణ్ తన ఛరిష్మా చూపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











