Game Changer Day 12 Box Office: బాక్సాఫీస్ వద్ద ‘ గేమ్ ఛేంజర్ ’ ఎదురీత.. 12వ రోజు ఎన్ని కోట్లంటే?
Game Changer Day 12 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ (Game Changer). భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ, తరువాత అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మొదటి వారం సో సోగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ 12 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టింది?
RRR విజయం తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. రాంచరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తెరకెక్కించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'(Game Changer). అలాగే.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ప్రమోషన్స్ తో కలిపి మొత్తం రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

గేమ్ ఛేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ డే 1 ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే.. మిక్స్ డ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి గేమ్ ఛేంజర్ వసూళ్లు క్రమంగా తగ్గిపోయాయి. రెండో రోజు రూ.21.6 కోట్లు, మూడో రోజు రూ. 17 కోట్లు, 4వ రోజు రూ.8.50 కోట్లు, 5వ రోజు రూ. 10.19 కోట్లు, 6వ రోజు రూ. 7.11 కోట్లు, 7వ రోజు రూ. 4.5 కోట్లు, 8వ రోజు రూ. 2.75 కోట్లు, 9వ రోజు రూ.2.4 కోట్లు, 10వ రోజు రూ.2.6 కోట్లు, 11వ రోజు 1.42 కోట్లు వసూలు చేసింది.
ఇక గేమ్ ఛేంజర్ 12 వ రోజుల కలెక్షన్స్ వివరాల్లోకెళ్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.0.69 కోట్లు, తమిళ్‌లో రూ.9 లక్షలు, హిందీలో రూ.32 లక్షలు , కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.12 లక్షల చొప్పున ఇలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1.2 కోట్ల వసూల్లు రాబట్టింది. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ 12 రోజుల్లో ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.127.84 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మిక్స్‌డ్ టాక్, నెగిటివిటీ వస్తున్నా రామ్ చరణ్ తన ఛరిష్మా చూపిస్తున్నాడు. మొదటివారం కలెక్షన్లు పర్వాలేదని పిలిచినా.. రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications











