Game Changer Day 14 Box Office: దారుణంగా పడిపోయిన ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్స్ .. 14 వ రోజు ఎన్ని కోట్లంటే?

Game Changer Day 14 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా.. డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ' గేమ్ ఛేంజర్'(Game Changer). భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ, ఆ తర్వత అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ఎంత కలెక్ట్ చేసింది? ఈ 14 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టింది? వివరాల్లోకెళ్తే..

గేమ్ చేంజర్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రధాన పాత్రలో నటించగా, కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, నాసర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మలు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎస్. శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ అందించి డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో తెలుగులో మొదటిగా డైరెక్ట్ సినిమా తీయడం. అలాగే..RRR విజయం తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు పెరిగాయి.

Ram Charan Shankar s Film Game Changer Box Office Day 14 collections report

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ని ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ప్రమోషన్స్ తో కలిపి మొత్తం రూ.500 కోట్లు ఖర్చు చేశారు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ వల్ల గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇక మిక్స్ డ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి వసూలు క్రమంగా తగ్గిపోయాయి. రెండో రోజు రూ.21.6 కోట్లు, మూడో రోజు రూ. 17 కోట్లు, 4వ రోజు రూ.8.50 కోట్లు, 5వ రోజు రూ. 10.19 కోట్లు, 6వ రోజు రూ. 7.11కోట్లు, 7వ రోజు రూ. 4.5 కోట్లు, 8వ రోజు రూ. 2.75 కోట్లు, 9వ రోజు రూ.2.4 కోట్లు, 10వ రోజు రూ.2.6 కోట్లు, 11వ రోజు 1.42 కోట్లు, 12వ రోజు రూ.1.2 కోట్లు, 13వ రోజు 1.1 కోట్లు వసూలు చేసింది.

Ram Charan Shankar s Film Game Changer Box Office Day 14 collections report

ఇక గేమ్ ఛేంజర్ 14వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకెళ్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.51 లక్షలు,తమిళ్‌లో రూ.6 లక్షలు, హిందీలో రూ.20 లక్షలు , కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.8 లక్షల చొప్పున ఇలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.0.85 కోట్ల వసూల్లు రాబట్టింది. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ 14 రోజుల్లో ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 128.85 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మిక్స్‌డ్ టాక్, నెగిటివిటీ స్ప్రెడ్ అయినా..రామ్ చరణ్ చరిష్మా . మెగా ఫ్యాన్స్ వల్లే ఈ సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. కానీ, ఈ వర్కింగ్ డేస్ లో కలెక్షన్లు మరి దారుణంగా పడిపోయాయి. ఇదిలాఉంటే.. గేమ్ ఛేంజర్ OTT విషయానికి వస్తే.. ఫిబ్రవరి రెండవ వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యే అవకాశం ఉంది. OTT రూల్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ కావొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X