Game Changer Day 17 Box Office: వీకెండ్ లోనూ ‘గేమ్ ఛేంజర్’కు భారీ దెబ్బ.. 17 వ రోజు ఎన్ని కోట్లంటే?

Game Changer Day 17 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కింది 'గేమ్ ఛేంజర్' (Game Changer). భారీ అంచనాలతో ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ, ఆ తర్వాత అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. క్రమంగా వసూలు తగ్గుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ గేమ్ ఛేంజర్ ఎంత కలెక్ట్ చేసింది ? ఈ 17 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టింది ? వివరాల్లోకెళ్తే..

గేమ్ చేంజర్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. అంజలి,ఎస్ జె సూర్య, నాసర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎస్.శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ శంకర్ తెలుగులో డైరెక్ట్ సినిమా తీయడం, అలాగే.. RRR విజయం తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు పెరిగాయి.

Ram Charan Shankar s Film Game Changer Box Office Day 17 collections report

ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ వల్ల గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ, మిక్స్ డ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి వసూలు క్రమంగా తగ్గిపోయాయి. 2వ రోజు రూ.21.6 కోట్లు, 3వ రోజు రూ. 17 కోట్లు, 4వ రోజు రూ.8.50 కోట్లు, 5వ రోజు రూ. 10.19 కోట్లు, 6వ రోజు రూ. 7.1 కోట్లు, 7వ రోజు రూ. 4.5 కోట్లు, 8వ రోజు రూ. 2.75 కోట్లు, 9వ రోజు రూ.2.4 కోట్లు, 10వ రోజు రూ.2.6 కోట్లు, 11వ రోజు 1.42 కోట్లు, 12వ రోజు రూ.1.2 కోట్లు, 13వ రోజు రూ. 1.1 కోట్లు, 14వ రోజు 85 లక్షలు, 15 వ రోజు రూ. 64 లక్షలు, 16వ రోజు రూ. 56 లక్షలు వసూలు చేసింది.
Ram Charan Shankar s Film Game Changer Box Office Day 17 collections report

ఇక గేమ్ ఛేంజర్ 17వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకెళ్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 36 లక్షలు, హిందీలో రూ.07 లక్షలు, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.5 లక్షల చొప్పున ఇలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 0.48 కోట్ల వసూలు రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ 17 రోజుల్లో ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 131.07 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ మూడు రోజులుగా కోటి మార్క్ ను కూడా దాటలేకపోతుంది గేమ్ ఛేంజర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X