Game Changer Day 18 Box Office: ఘోరంగా పడిపోయిన ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్స్ .. 18 వ రోజు ఎన్ని లక్షలంటే?

Game Changer Day 18 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'గేమ్ ఛేంజర్'(Game Changer). భారీ అంచనాలతో ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడినట్లుగా తెలుస్తోంది. రోజు రోజు కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతున్నాయి. కాగా..ఇప్పటి వరకూ గేమ్ ఛేంజర్ ఎంత కలెక్ట్ చేసింది ? ఈ 18 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టింది ? వివరాల్లోకెళ్తే..

వినయ విధేయ రామ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని దక్షిణాది స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ షణ్ముగం తెరకెక్కించారు. అంజలి,ఎస్ జె సూర్య, నాసర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Ram Charan Shankar s Film Game Changer Box Office Day 18 collections report

ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ శంకర్ తెలుగులో డైరెక్ట్ సినిమా తీయడం, అలాగే.. RRR విజయం తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు పెరిగాయి. సంక్రాంతి బరిలోకి దిగిన గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్స్ దారుణంగా చతికిలపడింది. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాల కంటే ముందుగా జనవరి 10న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాకు రోజు రోజు కలెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడినట్లుగా తెలుస్తోంది.

ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ, మిక్స్ డ్ టాక్ రావడంతో రెండవ రోజు నుంచి కలెక్షన్స్ క్రమంగా పడిపోయాయి. 2వ రోజు రూ.21.6 కోట్లు, 3వ రోజు రూ. 17 కోట్లు, 4వ రోజు రూ.8.50 కోట్లు, 5వ రోజు రూ. 10.19 కోట్లు, 6వ రోజు రూ. 7.1 కోట్లు, 7వ రోజు రూ. 4.5 కోట్లు, 8వ రోజు రూ. 2.75 కోట్లు, 9వ రోజు రూ.2.4 కోట్లు, 10వ రోజు రూ.2.6 కోట్లు, 11వ రోజు 1.42 కోట్లు, 12వ రోజు రూ.1.2 కోట్లు, 13వ రోజు రూ. 1.1 కోట్లు, 14వ రోజు 85 లక్షలు, 15 వ రోజు రూ. 64 లక్షలు, 16వ రోజు రూ. 56 లక్షలు, 17 వ రోజు 48 లక్షలు వసూలు చేసింది.

Ram Charan Shankar s Film Game Changer Box Office Day 18 collections report

ఇక గేమ్ ఛేంజర్ 18వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకెళ్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 41 లక్షలు వసూలు రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి వారం రూ. 117.65 కోట్లు, రెండో వారం రూ. 11.15 కోట్లు వసూలు చేసింది గేమ్ ఛేంజర్. ఇక ఇప్పటివరకు అంటే.. 18 రోజుల్లో దీంతో గేమ్ ఛేంజర్ మూవీ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 131.80 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. అలాగే..గత వారం రోజులుగా కోటి మార్క్ ను కూడా దాటలేకపోతుంది గేమ్ ఛేంజర్. దీని బట్టి గేమ్ ఛేంజర్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X