Game Changer Day 9 Box Office: చతికిలపడిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్..9 వ రోజు ఎన్ని కోట్లంటే?
Game Changer Day 9 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతోంది. ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినా గేమ్ ఛేంజర్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టడంలో విఫలమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో 9వ రోజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు నటించగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

గేమ్ ఛేంజర్ మూవీ విడుదలకు ముందు రిలీజ్ అయినా పాటలు, టీజర్, ట్రైలర్లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే 145 కోట్ల రూపాయల బిజినెస్ కాగా.. 150 కోట్ల రూపాయల షేర్ తో, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అయితే.. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ఆ తర్వాత రెండో రోజు నుంచి గేమ్ ఛేంజర్ వసూళ్లు పడిపోతూ, మధ్యలో లేస్తూ సాగుతోంది. రెండో రోజు రూ.21.6 కోట్లు, మూడో రోజు రూ. 17 కోట్లు, నాలుగో రోజు రూ. 8.50 కోట్లు, ఐదవ రోజు రూ. 10.19 కోట్లు, ఆరవ రోజు రూ. 7.11 కోట్లు , 7వ రోజు రూ. 4.5 కోట్లు, 8వ రోజు రూ. 2.75 కోట్లు వసూలు చేసింది. గేమ్ ఛేంజర్ కు డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

ఇకపోతే.. గేమ్ ఛేంజర్ 9వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.02 కోట్లు, తమిళ్‌లో రూ. 0.15 కోట్లు, హిందీలో రూ. 41 లక్షలు , కర్ణాటక , కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.11 లక్షల చొప్పున మొత్తంగా రూ. 2.58 కోట్ల వసూల్లు రాబట్టింది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. మిక్స్‌డ్ టాక్, నెగిటివిటీ వస్తున్నా రామ్ చరణ్ తన ఛరిష్మా చూపిస్తున్నాడు. అయితే ఆదుకుంటుంది అనుకున్న హిందీ బెల్ట్ కూడా ఇప్పుడు చేతులెత్తేస్తూ ఉండటంతో గేమ్ ఛేంజర్ యూనిట్ టెన్షన్ పడుతోంది.


Click it and Unblock the Notifications











