Game Changer Day 7 Box Office: గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. 7 వ రోజు ఎన్ని కోట్లంటే?

Game Changer Day 7 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తరువాత నుంచి గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ తగ్గుతున్నాయనేది వాస్తవం. అయితే.. ఇప్పటివరకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే ? ఏడో రోజు (Game Changer Day 7 expected collections) కలెక్షన్ వివరాల్లోకెళ్తే..

మెగా హీరో రామ్ చరణ్ హీరో - శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్‌ (Game Changer). ఈ మూవీలో రామ్ చరణ్ హీరో గా డ్యూయల్ రోల్ నటించగా.. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్ వేల్మురుగన్ స్క్రీన్ ప్లే అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరీర్ హైయ్యేస్ట్ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రామ్ చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబోలో రావడంతో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగిందట.

Ram Charan-Shankar s Film Game Changer Box Office Day 7 expected collections report

ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. గేమ్ ఛేంజర్ మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ₹ 51 కోట్ల నికర వసూళ్లను సాధించింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు రూ. 21.6 కోట్లు, మూడు రోజు రూ.17 కోట్టు, నాలుగవ రోజు రూ. 8.50 కోట్లు, ఐదవ రోజు రూ. 10.19 కోట్లు, ఆరవ రోజు 7.11 కోట్లు వసూలు చేసింది గేమ్ ఛేంజర్.

ఇక ఏడో రోజు గేమ్ ఛేంజర్ అంచనా కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. Sacnilk అంచనా ప్రకారం గురువారం (జనవరి 16)
నాడు గేమ్ ఛేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 2.44 కోట్లు వసూలు చేసింది. దీంతో గేమ్ ఛేంజర్ ఏడు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.115.59 కోట్లకు చేరుకుంది.

Ram Charan-Shankar s Film Game Changer Box Office Day 7 expected collections report

ఇప్పటి వరకు మార్నింగ్, మాట్నీ షోల వివరాలు మాత్రమే. ఇక రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది. ఏడో రోజు రూ. 10 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశముందనీ మూవీ ట్రేడర్స్ అంచనాలు వేశారు. గేమ్ ఛేంజర్ .. మూవీపై బాలయ్య డాకుమహారాజ్, వెంకటేష్ ' సంక్రాంతికి వస్తున్నాం'ల నుంచి ఎఫెక్ట్ పడుతోంది. మరోవైపు.. ఫైరసీ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ కలెక్ష్లన్లపై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X