Game Changer Day8 Box Office: పడిపోతున్న గేమ్ ఛేంజర్‌ కలెక్షన్స్ .. 8 వ రోజు ఎన్ని కోట్లంటే?

Game Changer Day 8 Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్-కియారా అద్వానీ లు ఈ సినిమాలో జంటగా నటించారు. పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే.. ఇప్పటివరకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే ? 8 రోజు (Game Changer Day 8 expected collections) కలెక్షన్ వివరాల్లోకెళ్తే..

మెగా హీరో రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్‌ (Game Changer). ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రగని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. RRR లాంటి భారీ హిట్ అందుకున్న రామ్ చరణ్ సోలోహీరో మూవీ కావడం, సక్సెస్ పుల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రావడంతో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగాయి.

Ram Charan-Shankar s Film Game Changer Box Office Day 8 expected collections report

సంక్రాంతి బరిలో మొట్ట మొదటగా దిగిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పరంగా రోజురోజుకు చతికిలపడినట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య డాకు మహారాజ్ లు గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్ ప్రభావం చూపుతున్నాయి. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై రోజురోజుకు తగ్గుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. గేమ్ ఛేంజర్ మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ నెట్ కలెక్షన్ ప్రకారం.. మొదటి రోజు రూ. 51 కోట్ల నికర వసూళ్లను సాధించగా.. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక రెండో రోజు గేమ్ ఛేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 21.6 కోట్లు, మూడు రోజు రూ.17 కోట్టు, నాలుగవ రోజు రూ. 8.50 కోట్లు, ఐదవ రోజు రూ. 10.19 కోట్లు, ఆరవ రోజు రూ. 7.11 కోట్లు, 7 వరోజు 4.5 కోట్లు వసూలు చేసింది.

Ram Charan-Shankar s Film Game Changer Box Office Day 8 expected collections report

ఇక 8 వ రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. Sacnilk ప్రకారం శుక్రవారం (జనవరి 17) గేమ్ ఛేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1.17 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో గేమ్ ఛేంజర్ ఎనిమిది రోజుల్లో గేమ్ ఛేంజర్ నికర వసూళ్లు రూ. 118.82 కోట్లకు చేరుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా వారం రోజుల్లో రూ. 197 కోట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ గణాంకాలు మార్నింగ్, మాట్నీ షోల వివరాలు మాత్రమే. ఇక ఫస్ట్, సెకండ్ షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది. ఎనిమిదో రోజు రూ. 8 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశముందనీ మూవీ ట్రేడర్స్ అంచనాలు వేశారు. గేమ్ ఛేంజర్ .. మూవీపై డాకుమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు.. ఫైరసీ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ కలెక్ష్లన్లపై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X