RRR విడుదల కంటే ముందే రెమ్యునరేషన్ డోస్ పెంచిన రామ్ చరణ్.. ఆ రెండు సినిమాలకు 100కోట్లు?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరొక హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని అందరిలో నమ్మకం ఉంది. ఇక రామ్ చరణ్ ముందుగానే సైన్ చేసిన సినిమాలకు రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు రకాల షేడ్స్ లో..
RRR సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ నెవర్ బిఫోర్ అనేలా మూడు రకాల షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఈ మెగా నందమూరి హీరోలను దర్శకుడు రాజమౌళి ఓకే లెవెల్ లో ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది.

మార్కెట్ ను సెట్ చేసుకోవాలని
ఇక ప్రస్తుతం RRR సినిమా తప్పకుండా అంచనాలకు మించి కలెక్షన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమాతో వారికంటూ ఒక పాన్ ఇండియా మార్కెట్ ను సెట్ చేసుకోవాలని రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో బలంగా కోరుకుంటున్నారు. ఇక వారి తదుపరి సినిమాలకు రెమ్యునరేషన్ కూడా అంతకుమించి అనేలా డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రెమ్యునరేషన్ 100కోట్లు.. ?
RRR సినిమా అనంతరం రామ్ చరణ్ శంకర్ సినిమా తో బిజీ కానున్నాడు. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ RRR ప్రభావం వలన ఈ సినిమాకు రెమ్యునరేషన్ మరింత ఎక్కువగా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ లెక్క వంద కోట్ల వరకు వెళుతున్నట్లుగా టాక్ వస్తోంది.

ఆ సినిమాకు కూడా..
ఇక రామ్ చరణ్ తేజ్ 16వ సినిమాను యు.వి.క్రియేషన్స్ ఎన్ వి ఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాకు కూడా మార్కెట్ ను బట్టే రెమ్యునరేషన్ వంద కోట్ల వరకు ఉంటుంది అని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ రామ్ చరణ్ మాత్రం RRR ప్రభావం వలన తన పారితోషికాన్ని ఎక్కువగా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అనుకున్నంత కలెక్షన్స్ వస్తాయా?
రామ్ చరణ్ తేజ్ కు ప్రస్తుతం డిమాండ్ గట్టిగానే ఉంది కాబట్టి నిర్మాతలు కూడా అతనికి అడిగినంత ఇస్తారు అని చెప్పవచ్చు. అయితే RRR సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ సినిమా కలెక్షన్స్ బట్టి కూడా లెక్కలు ఈజీగా మారుతాయి అని చెప్పవచ్చు. సినిమా ఈజీగా వెయ్యికోట్ల ను దాటుతుందని బాహుబలి రెండో భాగం రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో అనే సందేహం కూడా కలుగుతుంది.


Click it and Unblock the Notifications











