Orange 3 Days Collections: ఆరెంజ్ హిట్టు బొమ్మ అని నిరూపించారు.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఆరెంజ్ సినిమా ఇటీవల రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఈ సినిమా డిజాస్టర్ అని తేల్చేసిన ప్రేక్షకులు ఇప్పుడు హిట్టు బొమ్మ అని నిరూపిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు మంచి కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక రీ రిలీజ్ అయిన మూడవరోజు కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తంగా మూడు రోజుల్లో ఆరెంజ్ సినిమా ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

అప్పట్లో హిట్ కాంబో..
2010లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆరెంజ్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అప్పటివరకు దర్శకుడు భాస్కర్ బొమ్మరిల్లు పరుగు సినిమాలతో వరుసగా సక్సెస్ అందుకున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్ తేజ్ మగధీర సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో తప్పకుండా హిట్ కాంబినేషన్ అనే అనుకున్నారు.

అప్పట్లో డిజాస్టర్ టాక్
నాగబాబు నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్లో నిర్మించిన ఆరెంజ్ సినిమా అప్పట్లో గ్రాండ్ గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా అప్పట్లో దారుణంగా నష్టలను కలిగించింది. లవ్ కొంత కాలమే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అప్పట్లో జనాలకు అంతగా ఎక్కలేదు. ఇక కలెక్షన్స్ రెండవ రోజుకు దారుణంగా పడిపోయాయి. ఆ ఆర్థిక ఇబ్బందులు చాలా కాలం పాటు తనను వెంటాడాయి అని కూడా నాగబాబు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశాడు.

రీ రిలీజ్.. అదిరిపోయే కలెక్షన్స్
అయితే మళ్లీ ఇంతకాలం తర్వాత రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయడంతో మంచి రెస్పాన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు ఈ సినిమాను ఎప్పటినుంచో రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ అయితే వస్తోంది. ఇక మొత్తానికి ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు కంటే ఒకరోజు ముందు విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే నమోదయ్యాయి.

3 రోజుల్లో ఏపీ నైజాం కలెక్షన్స్
ముఖ్యంగా నైజం ఏరియాలోనే ఆరెంజ్ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ అందడం విశేషం. ఇక మూడో రోజుల్లో నైజాం ఏరియాలోని సినిమా 1.17 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక సీడెడ్ లో 15 లక్షలు ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 61 లక్షలు వచ్చాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు కోటిన్నరకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం.

టోటల్ కలెక్షన్స్
ఇక కర్ణాటకలో 11 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ షోలను ప్రదర్శించగా మరో లక్ష రూపాయల గ్రాస్ దక్కింది. మొత్తంగా మూడు రోజుల్లో ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ రెండు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా బాక్సాఫీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

జనసేన పార్టీకి విరాళంగా కలెక్షన్స్
ఇక ఆరెంజ్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ జనసేన పార్టీకి సంబంధించిన సంక్షేమ నిధికి అందజేయబోతున్నారు. గతంలోనే ఖుషి సినిమాకు వచ్చిన కలెక్షన్స్ జనసేన పార్టీకి అందించారు. అయితే ఇప్పుడు నాగబాబు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆరెంజ్ సినిమాను రి రిలీజ్ చేయడం జరిగింది. అప్పట్లో 40 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దారుణంగా నష్టాలను కలుగజేసినప్పటికీ ఇప్పుడు మాత్రం రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ జనసేన పార్టీ సహాయ నిధికి అందిస్తూ ఉండడం విశేషం.


Click it and Unblock the Notifications











