Orange Collections: 2 కోట్ల వరకు క్లోజ్ అన్నారు.. కానీ ఆ లెక్క కంటే ఎక్కువగా టోటల్ కలెక్షన్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డిఫరెంట్ లవ్ స్టొరీ ఆరెంజ్ సినిమా ఇటీవల రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన ఈ సినిమాను నేటితరం ఆడియేన్స్ మాత్రం కల్ట్ మూవీ అని తేల్చేశారు. బాక్సాఫీస్ వద్ద ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుతున్నాయి. ఇక ఆరెంజ్ సినిమా ఇప్పటివరకు రీ రిలీజ్ లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

అంచనాలు పెరిగిపోయాయి
బొమ్మరిల్లు, పరుగు వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తరువాత దర్శకుడు భాస్కర్ రామ్ చరణ్ తో ఆరంజ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా అనౌన్స్ చేయగానే అభిమానుల్లో ఒక్కసారి అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే అప్పుడే రామ్ చరణ్ తేజ్ మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇక ఆ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆరెంజ్ విడుదలకు ముందే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది.

అప్పట్లో కనెక్ట్ కాలేదు
అయితే లవ్ అనేది కొంతకాలం బాగుంటుంది అని ఒక సెన్సిటివ్ పాయింట్ ను సరికొత్తగా చూపించాలి అని అనుకున్నారు. అయితే అప్పట్లో ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో జనాలకు కనెక్ట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండవ రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. అప్పట్లో ఈ సినిమా కారణంగా నాగబాబు అప్పుల పాలు కావాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకునే ఆలోచన కూడా వచ్చింది అని ఆయన ఇంటర్వ్యూలలో కూడా వివరణ ఇచ్చాడు.

హిట్ కావాల్సిన సినిమా
అయితే ఆరెంజ్ సినిమా అప్పట్లో ఆ స్థాయిలో డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత తరం ఆడియన్స్ మాత్రం ఆ సినిమా బెస్ట్ లవ్ స్టోరీ అని సోషల్ మీడియాలో పొగిడిన విధానం చిత్ర యూనిట్ సభ్యులకు బాగానే కనెక్ట్ అయింది. ఇక వెంటనే సినిమాను రీ రిలీజ్ చేసి ఇది హిట్ కావాల్సిన సినిమా అని చెప్పకనే చెప్పేశారు. ముఖ్యంగా హరిస్ జైరాజ్ ఈ సినిమాకి అందించడం మ్యూజిక్ ఇప్పటికీ ఆల్ టైం బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది.

హౌస్ ఫుల్ కలెక్షన్స్
ఇక ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ స్థాయిలోనే విడుదల చేయడం జరిగింది. ఇక మొదటి రెండు మూడు షోలకే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నిర్మాత నాగబాబు మళ్ళీ రెండో రోజు నుంచి షోల సంఖ్యను కూడా పెంచాల్సి వచ్చింది. నైజంలోని ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం. ఎక్కడ షోలు ప్రదర్శించిన కూడా మొదటి రెండు రోజుల్లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్లు కనిపించాయి.

మొత్తం లెక్క..
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా ఈ సినిమా దాదాపు 15 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా కూడా ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ లో ఇప్పటివరకు 3 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు ఇది ఐదు రోజుల లెక్కనే అని తెలుస్తోంది. ఇంకా సినిమా కొన్ని ఏరియాలలో మంచి కలెక్షన్స్ తోనే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది

జనసేన కోసం భారీగా..
అయితే ఆరెంజ్ సినిమా రిలీజ్ చేయడమే కాకుండా ఈ సినిమాతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సినిమాకు వచ్చే డబ్బును జనసేన పార్టీ సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించాలి అని నాగబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆరెంజ్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను థియేటర్ ఖర్చులు మినహాయించి మిగతా డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నారు. ఒక విధంగా ఇది న్యూ రికార్డ్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











