రామ్ చరణ్ ‘ఎవడు’ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం 'ఎవడు' . శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ కాగా, బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ శరవేగంగా రికార్డు రేట్లతో జరుగుతోంది.

ఇక ఇప్పటివరకూ ఖరారైన డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదిగో..

నైజాం- గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ (అల్లు అర్జున్)
సీడెడ్ - ఎన్.వి. ప్రసాద్
వైజాగ్ - దిల్ రాజు
తూర్పు గోదావరి- గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్
పశ్చి మ గోదావరి- గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్
గుంటూరు - దిల్ రాజు
నెల్లూరు-లీలా మోహన్ రెడ్డి

ఇవి ట్రేడ్ లో చెప్పబడుతున్న వివరాలు..వీటిల్లో పరిస్దితులను బట్టి కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు.

దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ''రామ్‌ చరణ్‌ని ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అలరిస్తాయని''అన్నారు. ఐటం సాంగ్ ల స్పెషలిస్ట్ అయిన దేవి ఈ చిత్రం కోసం కెవ్వు కేక పాటను మించేలా ఐటం సాంగ్ ని స్వరపరిచారని చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X