Game Changer US Collections.. గుంటూరు కారం రికార్డు ఔట్.. విడుదలకు ముందే గేమ్ ఛేంజర్ కు ఎన్ని కోట్లంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలున్నాయి. 2024లో బ్లాక్‌బస్టర్ హిట్లతో పాటు బాక్సాఫీస్ వద్ద రెండు సార్లు రూ.1000 కోట్లకు పైగా క్రాస్ చేసి ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చెలాయించింది టాలీవుడ్. ఈ జోష్‌నను సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేయాలని తెలుగు సినిమా పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతటి అంచనాలున్న సినిమాగా గేమ్ ఛేంజర్ నిలిచింది. బ్లాక్‌బస్టర్ హిట్‌తో కొత్త ఏడాదిని ధాటిగా ఆరంభించాలని టాలీవుడ్ కూడా పట్టుదలగా ఉంది.

సామాజిక సమస్యలకు కమర్షియల్ యాంగిల్ జోడించడంలో శంకర్ స్పెషలిస్ట్. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఆయన ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. శంకర్ సినిమా అంటే బ్లాక్‌బస్టర్ అన్న స్టేజ్ నుంచి అభిమానులు భయపడే పరిస్ధితికి వచ్చింది. స్నేహితుడు, ఐ, రోబో 2.0 సినిమాలు పర్లేదు అనిపించుకున్నప్పటికీ ఎన్నో ఆశలు పెట్టుకుని, మరెన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు -2 దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Ram charans Game Changer is behind the Kalki 2898 Ad and Pushpa 2 in US Premiere Pre Sales

ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని శంకర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాతో గెట్ బ్యాక్ కాకుంటే శంకర్ భవిష్యత్తుపై గట్టి ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆయన చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్‌పైనే ఒత్తిడి పెరుగుతుంది . అందుకే అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని శంకర్ తన అనుభవాన్ని మొత్తం రంగరించి గేమ్ ఛేంజర్ తీసుకొస్తున్నారు.

ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోందని ఫిలింనగర్ టాక్.

కాగా.. తెలుగు సినిమాకు పెద్ద మార్కెట్‌గా మారిన యూఎస్‌లో గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్‌కి సంబంధించి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. జనవరి 3 వరకు అమెరికాలో 1200 షోలకు గాను దాదాపు 15 వేల టికెట్లకు పైగా అమ్ముడు కాగా.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా 425K డాలర్లు (భారత కరెన్సీలో రూ.3.60 కోట్లు) పైనే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా మహేశ్ బాబు గుంటూరు కారం రికార్డులను అధిగమించింది గేమ్ ఛేంజర్.

అయితే ఈ లిస్ట్‌లో అనకొండల్లాంటి తెలుగు సినిమాలు ఉన్నాయి. కల్కి 2898 ఏడీ 1.60 మిలియన్ డాలర్లతో టాప్‌లో ఉండగా తర్వాత పుష్ప 2 ( 1.55 మిలియన్లు), దేవర (1.48 మిలియన్లు), సలార్ (703K)లు మందున్నాయి. సలార్ తప్పించి మిగిలిన మూడు సినిమాలు ప్రీ రిలీజ్‌కు వారం ముందే 1 మిలియన్ క్లబ్‌లో చేరగా.. ఎన్నో అంచనాలున్న గేమ్ ఛేంజర్ మాత్రం ఇంకా హాఫ్ మిలియన్ కూడా టచ్ చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శనివారం రాజమండ్రిలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత గేమ్ ఛేంజర్ బిజినెస్‌కు ఊపొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: ram charan game changer s shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X