Peddi OTT Business: పెద్ది మూవీ ఓటీటీ బిజినెస్ సంచలనం.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్ల డీల్ అంటే?
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగా.. రికార్డు లెవెల్‌లో ఓటీటీ బిజినెస్ కావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా ఓటీటీ, ఇతర బిజినెస్ వ్యవహారాల్లోకి వెళితే..
తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు.

పెద్ది సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ లెవెల్‌లో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో సెట్ వేసి యాక్షన్ సన్నివేశాలు, క్రికెట్ ఆటకు సీన్లను షూట్ చేస్తున్నారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు అన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. రామ్ చరణ్ లుక్, క్రికెట్ షాట్ అందర్నీ మెస్మరైజ్ చేసింది.
అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల ఓటీటీ బిజినెస్ అంతా గందరగోళంగా మారింది. పలువురు స్టార్ హీరోల సినిమాల ఓటీటీ బిజినెస్ జరగడం లేదు. చాలా మంది హీరోలు సినిమాలు ఓటీటీ బిజినెస్ డీల్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ది షూటింగ్ దశలోనే ఉండగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ రేటుకు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. పెద్ది సినిమాకు భారీగా క్రేజ్ ఉండటంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయి. అందులో ఫ్యాన్సీ రేట్‌ను కోట్ చేసిన నెట్‌ఫ్లిక్స్ ఈ హక్కులను సొంతం చేసుకొన్నది. రూరల్, స్పోర్స్ బేస్డ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న సినిమాను సుమారుగా 110 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద ఓటీటీ డీల్. విశ్వంభర, ఇతర భారీ బడ్జెట్ సినిమాలు పూర్తయ్యే దశలో ఉన్న వాటికి ఓటీటీ బిజినెస్ జరుగలేదనే విషయాన్ని అంటూ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఓటీటీ బిజినెస్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్, మ్యూజిక్, ఇతర హక్కుల కోసం భారీగా పోటీ ఉంది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 250 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇంకా మ్యూజిక్, శాటిలైట్ హక్కుల కోసం భారీగా రేటు పలుకుతుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే భారీ లాభాలను సొంతం చేసుకోవడంతోపాటు టేబుల్ ప్రాఫిట్‌తో రిలీజ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.


Click it and Unblock the Notifications











