RGV's NNN కలెక్షన్స్.. క్లైమాక్స్ కంటే తక్కువే కానీ.. లాభాలు వచ్చినట్లే..!
భవిష్యత్తులో థియేటర్స్ లేకపోయినా కూడా ఆర్జీవి సినిమాలు మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ లేదని అర్థమైపోయింది. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సినిమాలు చేయడం మాత్రం ఆపనని చెప్పేస్తున్న వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక శనివారం ఆర్జీవి వరల్డ్ లో రిలీజ్ చేసిన NNN సినిమాతో వర్మ మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.

ఒక వ్యూవ్ కోసం రూ.200
భవిష్యత్తు ఓటీటీలదే అంటూ తన సినిమాల కోసం ఒక సపరేట్ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసుకున్న ఆర్జీవి ఇక నుంచి డిఫరెంట్ సినిమాలు ఆన్లైన్ లోనే వస్తాయని క్లారిటీ ఇచ్చాడు. మొన్న మియా మాల్కోవా క్లైమాక్స్ తో వచ్చిన వర్మ ఇప్పుడు నేకెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా రేటును వర్మ ఒక వ్యూవ్ కి 200రూపాయలను ఫిక్స్ చేశాడు.

లాభల్లోకి వచ్చినట్లే..
మియా మాల్కోవాతో చేసిన క్లైమాక్స్ సినిమాకు కేవలం 100రూపాయలు ఫిక్స్ చేసిన ఆర్జీవి ఈ సారి డోస్ పెంచడంతో మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే హాట్ నెస్ తోనే NNNకి మంచి హైప్ క్రియేట్ చేశాడు. కలెక్షన్స్ తో చాలా వరకు వర్మ లాభాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

కలెక్షన్స్ ఎంతంటే..
NNN సినిమాకు వర్మ పెద్దగా ఖర్చు చేయలేదని అనిపిస్తోంది. ఇక ఈ మసాలా సినిమాలో ఉన్నవారు కూడా కొత్తవారే కావడం వల్ల రెమ్యునరేషన్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కలెక్షన్స్ విషయానికి వస్తే.. సినిమాను ఆన్లైన్ లో రిలీజ్ చేసిన కొన్ని గంటలకే వ్యూవ్స్ 30వేలకు చేరువవ్వడంతో 60లక్షల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఇదే దారిలో మరిన్ని సినిమాలు..
కేవలం బిజినెస్ కోసమే ఓ వర్గం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన వర్మ కలెక్షన్స్ గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే మియా మాల్కోవా క్లైమాక్స్ రేంజ్ లో అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ ని అందుకోలేదని తెలుస్తోంది. చూస్తుంటే వర్మ ఇదే దారిలో మరిన్ని సినిమాలతో లాభాలు అందుకునేలా కనిపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ మర్డర్ సినిమాతో ఎంతవరకు లాభాలు అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











