బిజినెస్ మేన్'పై వర్మ లేటెస్ట్ కామెంట్
రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు పూరీ జగన్నాధ్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ప్రమోషన్ భుజాన వేసుకున్నట్లున్నారు. ఆయన తాజాగా ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ... రేపు అంటే జనవరి 13న పెద్ద సునామీ ఆంధ్రప్రదేశ్ ని తాకబోతోందని వార్త. దాని పేరు బిజినెస్ మ్యాన్ అని ట్వీట్ చేసారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రానికి వర్మ కాన్సెప్టుని ఇచ్చారు. ఈ విషయాన్ని పూరీనే స్వయంగా చెప్పారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..'బిజినెస్ మేన్'. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్ వర్మ నుంచి ఫోనొచ్చింది.
మాటల్లో 'దావుద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలీదు, ఛోటా రాజన్ హల్‌చల్ లేదు, ఛోటా షకీల్ కూడా లేడు.... మైదానం ఖాళీ ఉంది. ఎవడైనా వచ్చి ఆడుకోవచ్చు...' అన్నారు. ఆ ఆలోచన నాలో నాటుకుపోయింది. వెంటనే ఈ కథ అల్లుకొన్నాను అన్నారు పూరీ జగన్నాధ్. ఇక నిజానికి బిజినెస్ మ్యాన్ టైటిల్ తో సూర్య హీరోగా వర్మ ఈ చిత్రం చేద్దామని ప్రకటన ఇచ్చారు. అయితే ఆ తర్వాత రక్త చరిత్ర పార్ట్ 2 ప్లాప్ కావటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అయితే ముంబైలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతూండటంతో పూరీ ...ఆయనతో టచ్ లోనే ఉంటూ వచ్చారు. అది చూసి చాలామంది మహేష్,వర్మ కాంబినేషన్ లో సినిమా కూడా వస్తుందని బావించారు.


Click it and Unblock the Notifications











