twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు 'రామ రామ కృష్ణ కృష్ణ' రిజల్టు ఏంటి?

    By Srikanya
    |

    మొన్న బుధవారం రిలీజైన 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం మొదటి రోజు మిక్సెడ్ టాక్ వినిపించినా ఫైనల్ గా ఫ్లాఫ్ అని తేలింది. ముఖ్యంగా కథలో హీరో అర్జున్ లేక రామ్ అన్న డైలమో చాలా మందికి కలిగి చర్చనీయాంశంగా మారింది. అందులోనూ హీరో కథలో ప్యామిలీలను కలపటం తప్పించి విలన్ ని సమర్దవంతంగా ఎదుర్కోవటానికి ప్రయత్నాలు చేయకపోవటం అభిమానులను ఇబ్బంది పెడుతున్న అంశం. అలాగే విలన్ కూడా ముందే స్క్రిప్టు చదివినట్లు కథకు కావల్సివచ్చినప్పుడల్లా కనపడుతూ హంగామా చేయటాన్నితప్పు పడుతున్నారు. మరో ప్రక్క లక్ష్యం చిత్రం తర్వాత చేసిన ఈ రెండో చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ' వర్కవుట్ కాకపోవటం కామన్ అని అందరూ అంటున్నారు. అలాగే బాలకృష్ణ సూపర్ హిట్ బంగారు బుల్లోడు చిత్రంలో విలన్ ట్రాక్ (అతని తమ్ముడిని చంపిన వారి వారసులును చంపాలని గాలించటం) ఈ చిత్రంలో విలన్ ట్రాక్ తో గుర్తు చేసుకుంటున్నారు.

    అలాగే అర్జున్ తన చెల్లెలతో పల్లెలో రహస్యంగా వచ్చి నివసించటం, అలాగే హీరోయిన్స్ ఇద్దరూ కూడా ఆ సినిమానే పోలిక రావటం (రమ్యకృష్ణ..పాత్ర బిందుమాధవి, ప్రియా ఆనంద్...రవీనా టాండన్) గుర్తు చేసుకుని దర్శకుడు ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు. ఇక తెలుగులో చాలా మంది దర్శకులుకు రెండో చిత్రం సిండ్రోమ్ ఉందన్న సంగతి గుర్తు చేస్తున్నారు. ఇక రామ్ కి మస్కా, గణేష్ ప్లాఫ్ ల తర్వాత ఇది హ్యాట్రిక్ ప్లాఫ్ అయితే దిల్ రాజుకు జోష్, మరో చరిత్ర చిత్రాల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ ప్లాఫ్ అని మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే సింహా విజయం ముందు ఈ చిత్రం నిలబడలేదని, సింహా చిత్రాన్ని తీసేసి కొన్ని ధియోటర్స్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు వేయటాన్ని కొందరు బాలయ్య అభిమానులు తప్పుపడుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X