Ram Nagar Bunny Collections: యాటిట్యూడ్ స్టార్ మూవీ కలెక్షన్లు ఎంత? రామ్ నగర్ బన్నీకి లాభామా? నష్టమా?
ప్రముఖ టెలివిజన్ నటుడు, నిర్మాత, దర్శకుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తొలి చిత్ర పరిచయంగా రిలీజైన చిత్రం రామ్ నగర్ బన్నీ. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. మళయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించగా, దివిజ ప్రభాకర్ సమర్పించారు. అక్టోబర్ 4వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే...
తన కెరీర్‌లో తొలి ప్రెస్ మీట్‌లోనే విపరీతమైన ట్రోల్స్‌తో యాటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న చంద్రహాస్.. తన సినిమా టీజర్లు, ట్రైలర్‌తో తన ప్రతిభను చూపించి పాజిటివ్‌గా మలచుకొన్నారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత చక్కటి ఫెర్ఫార్మెన్స్‌తో మరింత పాజిటివ్ టాక్‌ను మలుచుకొన్నారు.

ఇక ఈ మూవీని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషనల్ వ్యయంతో కలిపి ఈ సినిమాను సుమారుగా 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు బిజినెస్‌కు మంచి రెస్సాన్స్ లభించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 1 కోటి రూపాయలుగా నిర్ణయించారు.
రామ్ నగర్ బన్నీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కొంత సానుకూలంగా మారింది. అయితే ఆ టాక్‌ను పూర్తిగా కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోయారని టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈ సినిమా మౌత్ టాక్ పెరిగి కలెక్షన్ల రూపంగా మారితే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 20 లక్షల షేర్ 40 లక్షల గ్రాస్, రెండో రోజు 10 లక్షల షేర్ 20 గ్రాస్ వసూళ్లను, అలాగే మూడో రోజు 10 లక్షల షేర్.. 20 లక్షల గ్రాస్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమా 80 లక్షల గ్రాస్ వసూళ్లు.. 40 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. తొలివారాంతం తర్వాత ఈ సినిమా రాబట్టే కలెక్షన్లను బట్టే ఈ సినిమా ఎంత లాభం సంపాదించదనేది తేలుతుంది.


Click it and Unblock the Notifications











