Skanda Day 2 Collections: రెండో రోజే 'స్కంద'కు తగ్గిన కలెక్షన్లు... ఆ ఎఫెక్ట్ బాగా పడినట్లు ఉందే!
రామ్ తొలి పాన్ ఇండియా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తొలి రోజు నుంచి ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ... మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. అయితే రెండో కాస్త కలెక్షన్స్ తగ్గినట్లు ట్రెడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. దానికి కారణం మౌత్ టాక్. మరి రెండో రోజు స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళ్లు రాబట్టిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనువాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం స్కంద. ఇక ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రిన్స్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. తమన్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా రామ్ కెరియల్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది.

రామ్ బోయపాటి కాంబోలో తెరకెక్కిన 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 19 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ సినిమాకు తెలుగులో మొత్తంగా రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ చేసుకుంది.
మాస్ అండ్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన రామ్ 'స్కంద' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టింది. అందులోనూ సెలవు రోజు కావడంతో మ్యాట్నీ నుంచి ఈ చిత్రానికి బుకింగ్స్ భారీగా పెరిగాయి. దీంతో తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ. 8.62 కోట్లు షేర్, రూ. 13.80 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకుని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 10.57 కోట్లు షేర్, రూ. 18.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
ఇక రెండో రోజు థియేటర్ ఆక్యూపెన్సీ విషయానికి వస్తే... మార్నింగ్ షో 22.01శాతం ఆక్యూపెన్సీ నమోదు కాగా.. ఆఫ్టర్ నూన్ షో 28.25శాతం ఆక్యూపెన్సీ నమోదు అయింది. ఇక నైట్ షో కూడా భారీగా థియేటర్ ఆక్యూపెన్సీ నమోదు అయినట్లు తెలుస్తోంది.

ఇక రెండో రోజు స్కంద మూవీ వసూళ్ల విషయానికి వస్తే... తొలి రోజు రాబట్టిన స్థాయిలోనే ఇండియా వైడ్ ఈ సినిమా దాదాపు రూ.7 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్ రూ.2 కోట్లు రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 27 కోట్ల రూాపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











