Skanda 5 Days Collections: రూ.47 కోట్ల బిజినెస్... 5 రోజుల్లో వచ్చిందంతే.. ఇంకా ఎంత రాబట్టాలంటే?

హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్దకు వచ్చి 5 రోజులు దాటింది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఈసినిమా కలెక్షన్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వీకెండ్ కలెక్షన్లు బాగానే రాబట్టినా... వర్కింగ్ డేలో కాస్త కలెక్షన్లు తగ్గాయి. ఇక ఈ సినిమా ఐదు రోజుల కలెక్షన్ల రిపోర్టును గమనిద్దాం.

రామ్ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం స్కంద. ఇక ఈ మూవీ గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇక విడుదల అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ లభించింది. ఇక ఐదు రోజుల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే....

Ram Pothineni Boyapati Srinivas Skanda Movie 5 Days Worldwide Collections

స్కంద 5 రోజుల కలెక్షన్స్ గమనిస్తే.... తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 8.62 కోట్లు, రెండో రోజు రూ. 3.50కోట్లు, 3వ రోజు రూ.3.27కోట్లు, 4వ రోజు రూ.4.46 కోట్లు, 5వ రోజు రూ.2.72 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.22.57 కోట్ల షేర్ రాబట్టగా... రూ.37.30కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇక రామ్ బోయపాటి స్కంద 5వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ గమనిస్తే నైజాం రూ.1.04 కోట్లు, సీడెడ్ రూ.41 లక్షలు, ఉత్తర ఆంధ్ర రూ.37 లక్షలు, తూర్పు రూ.23 లక్షలు, పశ్చిమ రూ.15 లక్షలు, గుంటూరు రూ.24లక్షలు, కృష్ణ రూ.17లక్షలు, నెల్లూరు రూ.11లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా.. రూ.2.72 కోట్ల షేర్ (రూ.5.10 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

Ram Pothineni Boyapati Srinivas Skanda Movie 5 Days Worldwide Collections

స్కంద 5 రోజుల మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ గమనిస్తే.. నైజాం రూ.9.20 కోట్లు, సీడెడ్ రూ.3.31కోట్లు, ఉత్తర ఆంధ్ర రూ.2.85కోట్లు, తూర్పు రూ.1.69 కోట్లు, పశ్చిమ రూ 1.11కోట్లు, గుంటూరు రూ.2.21 కోట్లు, కృష్ణ రూ.1.21 కోట్లు, నెల్లూరు రూ.99లక్షలు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.22.57 కోట్లు (రూ.37.30కోట్ల గ్రాస్) వసూలు చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా వద్ద రూ. 2.26 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1.65 కోట్లు రాబట్టగా.. మొత్తంగా వరల్డ్ వైడ్ గా... రూ.26.48 కోట్లు (రూ.45.55 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

Ram Pothineni Boyapati Srinivas Skanda Movie 5 Days Worldwide Collections

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన స్కంద సినిమా నైజాం రూ.13 కోట్లు, సీడెడ్ రూ.8.50 కోట్లు, ఆంధ్రా రూ.19.50 కోట్లు కాగా... తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.41.00 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు కోట్లు బిజినెస్ చేసుకోగా... ఓవర్సీస్ లో రూ. 2.20 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇక మొత్తంగా ఈ సినిమా మొత్తం వ్యాపారం (విలువ) 46.20 కోట్లుగా బిజినెస్ చేసుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి వచ్చింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరో 20.52 కోట్లు రాబట్టాలి.

రామ్ పోతినేని స్కంద వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే... మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.10.57కోట్ల షేర్ (రూ.17.20 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇక 2వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.4.00 కోట్ల షేర్ (రూ.7.10కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఇక 3వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.3.81కోట్లు షేర్ (రూ.6.75కోట్లు గ్రాస్), ఇక 4వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.5.02CR~ షేర్ (రూ.8.55కోట్లు గ్రాస్), 5వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.3.08కోట్లు షేర్ (రూ.5.95కోట్లు గ్రాస్) వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X