RED Collections.. బ్రేక్ ఈవెన్‌కు అతి దగ్గరల్లో.. మూడు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే?

సంక్రాంతి బరిలోకి దిగిన చిత్రాలన్నీ కూడా వసూళ్ల పరంగా మంచి హిట్లుగా నిలుస్తున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలన్నీ నడుస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద అన్ని చిత్రాలు క్లీన్ హిట్ అయ్యేలానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పడ్డాయి. ఇంకొన్ని బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉన్నాయి. మొత్తంగా సంక్రాంతి మాత్రం టాలీవుడ్‌కు కలిసి వచ్చింది. ఇప్పుడు రామ్ హీరోగా వచ్చిన RED కలెక్షన్లలో దూసుకుపోతోంది.

ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

మొదటి రోజు అలా..

మొదటి రోజు అలా..

RED సినిమాపై మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చింది. అయితే అల్లుడు అదుర్స్ సినిమా కంటే REDకే ఎక్కువ బుకింగ్స్, ఓపెనింగ్స్ ఎక్కువగా వచ్చాయి. దీంతో అసలు RED సినిమా కలెక్షన్లు, అల్లుడు అదుర్స్ కలెక్షన్లలో పోటీయే లేకుండాపోయింది. RED ఫస్ట్ డే కలెక్షన్లు చూసి అందరూ షాక్ అయ్యారు.

అన్నింటి కంటే ఎక్కువగా..

అన్నింటి కంటే ఎక్కువగా..

సంక్రాంతి బరిలో నిలిచిన క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్, RED సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే వచ్చాయి. క్రాక్ సినిమాకు మొదటి రోజు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో ఫస్ట్ డే రికార్డ్‌ మిస్ అయింది. అందుకే RED సినిమాయే అన్నింటి కంటే ముందుగా ఉంది. దాదాపు పది కోట్లకు పైగా గ్రాస్, ఆరు కోట్లకు పైగా షేర్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మూడో రోజు అలా..

మూడో రోజు అలా..

RED సినిమాకు మూడో రోజు మంచి కలెక్షన్లే వచ్చాయి. ఏరియా వారిగా చూస్తే.. నైజాంలో 92 లక్షలు, సీడెడ్‌లో 48 లక్షలు, ఉత్తరాంధ్రలో 32 లక్షలు, ఈస్ట్ 25 లక్షలు, వెస్ట్ 17 లక్షలు, గుంటూరు 18 లక్షలు, క‌ృష్ణా 21 లక్షలు, నెల్లూరులో 18 లక్షలు కొల్లగొట్టింది.

మొత్తంగా ఎంతంటే..

మొత్తంగా ఎంతంటే..

RED సినిమా మూడో రోజు 5.20 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టగా.. అందులో 2.71 కోట్ల షేర్‌ను సాధించింది. అలా మొత్తంగా మూడు రోజుల్లో 21 కోట్ల గ్రాస్‌ను, 12.35 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. అంటే మొదటి రోజు 5.47కోట్లు, రెండో రోజు 4.17కోట్లు, మూడో రోజు 2.71కోట్ల కొల్లగొట్టి.. మొత్తంగా మూడు రోజుల్లో 12.35 కోట్ల షేర్‌ను సాధించింది.

బ్రేక్ ఈవెన్‌కు దగ్గరల్లో..

బ్రేక్ ఈవెన్‌కు దగ్గరల్లో..

RED సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మొత్తంగా 13.5 కోట్ల షేర్‌ను సాధించాలి. అయితే మూడో రోజుల్లొనే 12 కోట్లకు పైగా షేర్‌ను కొల్లగొట్టేసింది. అంటే ఈ ఒక్క రోజు గడిస్తే RED సినిమా లాభాల బాటపడినట్టే. అంటే ఇకపై వచ్చేందంతా కూడా లాభాలనే అన్నమాట. ఇక బ్రేక్ ఈవెన్‌ను సాధించేందుకు RED ఇంకా దాదాపు 1.15కోట్లు కొల్లగొట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X