RED Movie Day 1 Collections: రికార్డు స్థాయిలో వసూల్ చేసిన రామ్.. ఫస్ట్ డే ఎంత రాబట్టాడంటే!

ఎనర్జిటిక్ యాక్టింగ్‌కు తోడు అద్భుతమైన డ్యాన్స్.. ఫైట్స్.. డైలాగ్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు రామ్ పోతినేని. టీనేజ్‌లోనే హీరోగా పరిచయం అయిన అతడు.. ఆరంభంలోనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మధ్యలో వరుస పరాజయాలతో సతమతం అయిన అతడు.. 'ఇస్మార్ట్ శంకర్'తో బడా హిట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం 'రెడ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్.. టాక్‌తో సంబంధం లేకుండా అదగొడుతున్నాడు. ఇంతకీ ఈ మూవీ మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే?

కెరీర్ బిగ్ హిట్ తర్వాత ఇలా వచ్చిన రామ్

కెరీర్ బిగ్ హిట్ తర్వాత ఇలా వచ్చిన రామ్

'ఇస్మార్ట్ శంకర్' వంటి భారీ హిట్ తర్వాత రామ్ పోతినేని నటించిన చిత్రం 'రెడ్'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సొంత బ్యానర్‌లో స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్లు మాళవిక, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్‌లు నటించారు. అలాగే, రామ్ తన సుదీర్ఘమైన కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రభినయం చేశాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు.

వాటి నుంచి పోటీ.. అద్భుతమైన రెస్పాన్స్

వాటి నుంచి పోటీ.. అద్భుతమైన రెస్పాన్స్

సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు సినిమాలకు విశేషమైన స్పందన ఉంటుంది. అయితే, ఈ సారి మన చిత్రాలను కాదని.. తమిళ పరిశ్రమకు చెందిన 'మాస్టర్'కు ఎక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో రామ్ సినిమా చాలా తక్కువ ప్రాంతాల్లోనే విడుదల అవుతోంది. అయినప్పటికీ.. ఇప్పటికే షోలు పడిన చోట్ల 'రెడ్' మూవీకి అద్భుతమైన స్పందన వస్తోంది.

రామ్ మొదటిసారి.. టాక్ మాత్రం భిన్నంగా

రామ్ మొదటిసారి.. టాక్ మాత్రం భిన్నంగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. కెరీర్‌లో మొదటిసారి అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. 'రెడ్' మూవీ చూసిన వారంతా హీరో యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. వన్ మ్యాన్ షోలా మార్చేశాడని అంటున్నారు. అయితే, సినిమాకు టాక్ మాత్రం ఊహించని విధంగా వచ్చింది. ఈ మూవీని ఏవరేజ్ అంటున్నారు.

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లు మాత్రం ఫుల్

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లు మాత్రం ఫుల్


'రెడ్' మూవీ మొదటి షో పడినప్పటి నుంచే మిశ్రమ స్పందనను అందుకుంది. ఊహించే విధంగా ఉన్న కథ, దర్శకుడి వైఫల్యం, స్క్రీన్‌ప్లే తదితర అంశాలు నిరాశ జనకంగా ఉన్నాయని సినిమాను చూసిన వారంతా అభిప్రాయపడ్డారు. అయితే, రామ్ ఫ్యాన్స్ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లను రాబట్టిందీ సినిమా.

రికార్డు స్థాయిలో వసూల్ చేసిన హీరో రామ్

రికార్డు స్థాయిలో వసూల్ చేసిన హీరో రామ్

రామ్ నటించిన 'రెడ్' మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అంతకు ముందు నుంచే దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తూ.. టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఈ కారణంగా మొదటి రోజు ఈ సినిమా దాదాపు రూ. 5 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టిందని తెలుస్తోంది. ఇది రామ్ కెరీర్‌లో రెండో బెస్ట్ మూవీ.

గతంలో ఆ సినిమాతో రికార్డు క్రియేట్

గతంలో ఆ సినిమాతో రికార్డు క్రియేట్

గతంలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు మొదటి రోజు రూ. 7.5 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. ఇదే ఇప్పటి వరకూ రామ్ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్స్. ఇప్పుడు దాని తర్వాత 'రెడ్' మూవీకి రూ. 5 కోట్ల వరకూ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు మొత్తం ఇదే జోరు చూపిస్తే టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X