The Warriorr collections బాక్సాఫీస్ వద్ద రామ్ జోరు.. ప్రతికూల పరిస్థితులను అధిగమించిన ఉస్తాద్
ది వారియర్ మూవీ వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ సానుకూలమైన కలెక్షన్లను సాధిస్తున్నది. రామ్ పోతినేని, కృతిశెట్టి, ఆది పినిశెట్టి నటించిన ఈ చిత్రం తొలి రోజు వర్షాభావ పరిస్థితుల మధ్య భారీ కలెక్షన్లు సాధించింది. అయితే రెండో రోజు ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను సాధించిందంటే..

లాభాల్లోకి రావాలంటే?
ఇక ది వారియర్ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం 10 కోట్లు (స్రవంతి మూవీస్ సొంతంగా రిలీజ్), సీడెడ్ 5 కోట్లు, ఆంధ్రా 15 కోట్లతో 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 2.10 కోట్లు, తమిళ వెర్షన్ 4 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను అంచనా వేశారు. దాంతో ఈ చిత్రం 39 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత
తెలుగు రాష్ట్రాలను తుఫాన్ కుదిపేస్తున్న తరుణంలో రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ట్రేడ్ అనలిస్టుల అంచనాలకు భిన్నంగా మంచి వసూళ్లను సాధించింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డును అందుకొన్నది.

తొలి రోజున భారీ వసూళ్లు
ది వారియర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి రోజునే ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో మంచి వసూళ్లను సాధిందించింది. తొలి రోజు ఈ చిత్రం 7.06 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ చిత్రం గతేడాది రామ్ నటించిన రెడ్ చిత్రం సాధించిన 5.47 కోట్ల వసూళ్లను దాటేసింది.

రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు
ఇప్పటి వరకు రామ్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఇస్మార్ట్ శంకర్ తొలి రోజున 7.73 కోట్లు, హలో గురు ప్రేమ కోసమే 3.75 కోట్లు, ఉన్నది ఒకటే జిందగి 3.65 కోట్లు వసూలు చేసింది. అయితే వారియర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.6 హైర్స్‌తోపాటు 12.20 కోట్ల గ్రాస్ వసూళ్లను, 7.06 కోట్ల షేర్ రాబట్టింది.

రెండో రోజు కలెక్షన్ల అంచనా
ఇక ది వారియర్ సినిమా కూడా రెండో రోజు నిలకడగా వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రం రెండో రోజున 8 నుంచి 10 కోట్ల గ్రాస్ వసూళ్లను, 4 కోట్ల షేర్ సాధించే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజుల్లో ఈ చిత్రం 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. అధికారిక వసూళ్లు ఏ రేంజ్‌లో ఉంటాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











