Double iSmart 3 Days Collections: రామ్ మూవీకి దెబ్బ.. 3 రోజుల్లో ఊహించని విధంగా.. అసలు టార్గెట్ ఎంతంటే!
తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే, ఈ మధ్య కాలంలో సరైన హిట్‌ను అందుకోని అతడు.. ప్రయత్నాలు మాత్రం సాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఫలితంగా వసూళ్లు డల్‌గానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' సినిమా 3 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
డబుల్‌గా వచ్చేసిన శంకర్
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా, కావ్య థాపర్ హీరోయిన్ చేసింది. అలాగే, అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండే తదితరులు నటించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.

రామ్ మూవీకి బిజినెస్ ఇలా
రామ్ నటించిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి నైజాంలో రూ. 15.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 48.00 కోట్లు బిజినెస్ జరుపుకుంది.
3వ రోజు తెలుగులో ఎంత?
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు కూడా 'మిస్టర్ బచ్చన్' మాదిరిగానే ఆశించిన రీతిలో రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా మూడో రోజు కూడా ఇది డౌన్ అయిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి ఈ సినిమా మూడో రోజు కేవలం రూ. 89 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.

3 రోజులకు ఎంతొచ్చింది?
'డబుల్ ఇస్మార్ట్'కు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో డల్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 99 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 85 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో రూ. 8.13 కోట్లు షేర్, రూ. 11.95 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 8.13 కోట్లు రాబట్టిన రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ తక్కువే కలెక్ట్ చేసింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 81 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 68 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.62 కోట్లు షేర్, రూ. 15.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
మాస్ స్టోరీతో రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49.00 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 9.62 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 39.38 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











