Double iSmart 5 Days Collections: రామ్‌కు డబుల్ షాక్.. కోట్లు వచ్చినా కూడా.. హిట్ కావాలంటే మాత్రం!
టాలీవుడ్‌లో తనదైన సినిమాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చేసినా విజయాన్ని అందుకోలేకపోయిన అతడు.. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను చేశాడు. గతంలో వచ్చి హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్'కు ఇది సీక్వెల్‌గా రావడంతో ఎన్నో అంచనాలతో ఇది విడుదలైంది. కానీ, బాక్సాఫీస్ ముందు సరైన రీతిలో రాణించడం లేదు. మరి 'డబుల్ ఇస్మార్ట్' సినిమా 5 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
డబుల్ డోస్ రెడీ చేసేశాడు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా, కావ్య థాపర్ హీరోయిన్ చేసింది. అలాగే, అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండే తదితరులు నటించారు.

రామ్ మూవీకి భారీ బిజినెస్
రామ్ పోతినేని నటించిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి నైజాంలో రూ. 15.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 48.00 కోట్లు బిజినెస్ చేసింది.

5వ రోజూ డౌన్.. మొత్తంగా
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా చేసిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ చిత్రం వాటిని అందుకోలేక ఇబ్బంది పడుతోంది. అలాగే, క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 45 లక్షలు షేర్, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 55 లక్షలు షేర్ రాబట్టింది. ఇలా ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ. 11.00 కోట్లు షేర్ వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











