Double iSmart 7 Days Collections: 49 కోట్లు బిజినెస్.. వారంలో వచ్చింది ఇంతే.. రామ్ కెరీర్‌లోనే చెత్తగా!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన రీతిలో సందడి చేస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. భారీ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'డబుల్ ఇస్మార్ట్' మూవీతో వచ్చాడు. గతంలో వచ్చి హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్'కు ఇది సీక్వెల్‌గా రావడంతో ఎన్నో అంచనాలతో ఇది విడుదలైంది. కానీ, రెస్పాన్స్ అందుకోవట్లేదు. మరి 'డబుల్ ఇస్మార్ట్' 7 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
మరింత మాస్‌గా శంకర్
టాలెంటెడ్ హీరో రామ్ పోతినేనితో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన సినిమానే 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా, కావ్య థాపర్ హీరోయిన్ చేసింది. అలాగే, అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండేలు నటించారు.

రామ్ మూవీకి భారీ బిజినెస్
రామ్ పోతినేని హీరోగా చేసిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి నైజాంలో రూ. 15.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 17.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 48.00 కోట్లు బిజినెస్ జరిపింది.
7వ రోజు తెలుగులో ఎంత?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు కూడా 'మిస్టర్ బచ్చన్' మాదిరిగానే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా ఏడో రోజు కూడా ఇది భారీగా డౌన్ అయిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి ఈ సినిమా కేవలం రూ. 8 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.

7 రోజులకు ఎంతొచ్చింది?
'డబుల్ ఇస్మార్ట్'కు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 73 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, గుంటూరులో రూ. 96 లక్షలు, కృష్ణాలో రూ. 60 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో రూ. 9.51 కోట్లు షేర్, రూ. 14.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
7 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 9.51 కోట్లు రాబట్టిన రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ తక్కువే కలెక్ట్ చేసింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 98 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 78 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే ఏడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.27 కోట్లు షేర్, రూ. 18.60 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49.00 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 11.27 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 37.73 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా పయనం సాగిస్తోంది.


Click it and Unblock the Notifications











