Skanda 10 Days Collections: మళ్లీ దంచిన స్కంద..అన్ని కోట్లతో రామ్ రికార్డు..ఎన్ని కోట్లు రావాలంటే!
ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో ఎంతో మంది మీడియం రేంజ్ మార్కెట్ హీరోలు ఉన్న హీరోలు సత్తా చాటుతున్నారు. అందులో కొందరు మాత్రమే తమదైన ముద్రను వేస్తూ వెళ్తున్నారు. అలాంటి వారిలో రామ్ పోతినేని ఒకడు.
గత చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలన్న పట్టుదలతో 'స్కంద' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీకి మిక్స్‌డ్ టాకే వచ్చింది. అయినా ఓపెనింగ్స్ భారీగానే లభించాయి. ఆ తర్వాత డౌన్ అయినా మళ్లీ పుంజుకుంది. మరి 'స్కంద' 10 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

మాస్ కాంబినేషన్‌లో స్కంద: రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'స్కంద'. ఈ మాస్ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు.

స్కంద మూవీ ప్రీ బిజినెస్: మాస్ యాక్షన్‌తో వచ్చిన 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా దీనికి తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.

10వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'స్కంద'కి 10వ రోజు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 90 లక్షలు షేర్, రూ. 1.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

10 రోజులకూ కలిపి ఎంత?: 10 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'స్కంద'కి డీసెంట్ రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 10.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.11 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.38 కోట్లు, గుంటూరులో రూ. 2.60 కోట్లు, కృష్ణాలో రూ. 1.51 కోట్లు, నెల్లూరులో రూ. 1.16 కోట్లతో కలిపి.. రూ. 26.77 కోట్లు షేర్, రూ. 43.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 26.77 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.66 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.90 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.75 కోట్లు షేర్, రూ. 53.55 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది. దీంతో 30 కోట్ల మార్కు చేరుకుని రామ్ రికార్డు క్రియేట్ చేశాడు.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 30.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 16.25 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











